బ్యాంక్ ఆఫ్ ఇండియా(Bank Of India-BOI)లో 115 ఆఫీసర్ (Officer) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఇందులో చీఫ్ మేనేజర్ (Chief Manager) పోస్టులు 15, సీనియర్ మేనేజర్ (Senior Manager) పోస్టులు 54, మేనేజర్ (Manager) పోస్టులు 46 ఉన్నాయి. పోస్టులను బట్టి బీటెక్/బీఈ, ఎమ్మెస్సీ, ఎంసీఏ చేసినవారు అర్హులు. ఎంపికైనవారికి రూ.64 నుంచి లక్షా 20 వేల వరకు ఇస్తారు. అయితే.. సర్వీస్(Service)లో చేరే ముందు రెండో గ్రేడ్ ఆఫీసర్లు రూ.2 లక్షలు, మూడు, అంతకన్నా పై గ్రేడ్ ఆఫీసర్లు రూ.3 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్ (Security Deposit) చేయాలి. నవంబర్ 30లోపు ఆన్‌లైన్(బ్యాంక్ వెబ్‌సైట్)లో అప్లై చేసుకోవాలి. ఆన్‌లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ అనంతరం ఎంపిక చేస్తారు.
- Advertisement -
