Tuesday, October 28, 2025
ePaper
Homeసినిమాసీఎం రేవంత్‌ని మరోసారి కలిసిన నాగార్జున

సీఎం రేవంత్‌ని మరోసారి కలిసిన నాగార్జున

సీఎం రేవంత్ రెడ్డిని హీరో అక్కినేని నాగార్జున మరోసారి కలిశారు. ఇవాళ (2025 మే 31న) జూబ్లిహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో ఆయనతో కుటుంబ సమేతంగా భేటీ అయ్యారు. తన చిన్నకుమారుడు అఖిల్ వివాహానికి రావాలని ఆహ్వానించారు. అనంతరం రేవంత్‌తో కొద్దిసేపు చర్చలు జరిపారు. హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్‌ను హైడ్రా కూల్చివేసిన తర్వాత నాగార్జున తరచూ సీఎంని కలుస్తుండటం ఆసక్తి కలిగిస్తోంది. మొన్న మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన విందులో నాగార్జున సీఎంతో కలిసి పాల్గొన్నారు. అంతకుముందు కొంత మంది సినీ పెద్దలతో కలిసి ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. ఇప్పుడు కొడుకు పెళ్లికి పిలిచేందుకు మీట్ అయ్యారు. అక్కినేని అఖిల్ 2024 నవంబర్‌లో జైనబ్ రవ్జీతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. వీరి మ్యారేజ్ ఎప్పుడు అనేది అఫిషియల్‌గా వెల్లడి కాలేదు. కానీ.. 2025 జూన్ 6న జరగనుందని ప్రచారమవుతోంది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News