Monday, October 27, 2025
ePaper
Homeతెలంగాణవైరా మాజీ ఎమ్మెల్యే మృతి

వైరా మాజీ ఎమ్మెల్యే మృతి

ఖమ్మం జిల్లా వైరా మాజీ ఎమ్మెల్యే బాణోత్ మదన్ లాల్ గుండెపోటుతో మృతిచెందారు. హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మదన్ లాల్ 2014 శాసన సభ ఎన్నికల్లో వైరా నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించారు. తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అదే పార్టీ నుంచి బరిలో నిలిచినా ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి వైరా నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహిస్తున్నారు.

సీఎం సంతాపం

బాణోత్ మదన్ లాల్ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. మదన్ లాల్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News