Thursday, September 11, 2025
ePaper
spot_img
Homeఅంతర్జాతీయంవాస్తవం గ్రహించిన కొలంబియా.. కృతజ్ఞతలు తెలిపిన ఇండియా..

వాస్తవం గ్రహించిన కొలంబియా.. కృతజ్ఞతలు తెలిపిన ఇండియా..

ఆపరేషన్ సింధూర్‌ విషయంలో కొలంబియా దేశం వాస్తవాలను గ్రహించింది. గతంలో పాకిస్థాన్‌కి అనుకూలంగా చేసిన ప్రకటనను తాజాగా వెనక్కి తీసుకుంది. దీంతో మన దేశం దౌత్య విజయం సాధించింది. ఇండియా చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌తో పాకిస్థాన్‌లో వంద మంది టెర్రరిస్టులు హతమయ్యారు. వారికి కొలంబియా సంతాపం తెలిపింది. ఈ నేపథ్యంలో ఆ దేశంలో పర్యటించిన కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆధ్వర్యంలోని ప్రతినిధులు అసలు విషయాలను అక్కడి వారికి వివరించారు.

పెహల్గాం ఉగ్రదాడి వల్లే భారత్ ఆపరేషన్ సింధూర్‌ని చేపట్టాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఉగ్రవాదం విషయంలో పాకిస్థాన్ అనుసరిస్తున్న విధానాన్ని పట్టిచూపారు. కొలంబియా విదేశాంగ శాఖ ఉపమంత్రి రోసా యెలాండ్ విల్లవిసెన్సియోతో సమావేశమై నిజానిజాలను వెల్లడించారు. ఈ భేటీ అనంతరం యెలాండ్ మాట్లాడుతూ తమ స్టేట్‌మెంట్‌ని విత్‌డ్రా చేసుకుంటున్నట్లు చెప్పారు. ‘‘కాశ్మీర్‌లో ఏం జరిగిందీ? ఏంటీ? అనేది మాకు ఇవాళ అర్థమైంది. ఆపరేషన్ సింధూర్‌ బ్యాక్‌గ్రౌండ్‌పై అవగాహన వచ్చింది’’ అని పేర్కొన్నారు. దీంతో శశిథరూర్ కొలంబియాకి ధన్యవాదాలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News