Friday, October 3, 2025
ePaper
Homeజాతీయంరూ.7.08లక్షల కోట్ల జిఎస్టీ పన్ను ఎగవేత

రూ.7.08లక్షల కోట్ల జిఎస్టీ పన్ను ఎగవేత

కేంద్రమంత్రి పంకజ్‌ చౌదరి వెల్లడి

2024-25 ఆర్థిక సంవత్సరం వరకు ఐదు సంవత్సరాల్లో దాదాపు రూ.7.08లక్షల కోట్ల పన్ను ఎగవేతను కేంద్ర జీఎస్టీ ఫీల్డ్‌ అధికారులు గుర్తించారు. ఇందులో దాదాపు రూ.1.79లక్షల కోట్ల ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ మోసాలు ఉన్నాయని కేంద్రం తెలిపింది. ఆర్థిక సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి లోక్‌సభలో వివరాలను వెల్లడించారు. డేటా ప్రకారం.. 2024-25 ఆర్థిక సంవత్సరంలోనే రూ.2.23 లక్షలకోట్లకుపైగా జీఎస్టీ ఎగవేతను సీజీఎస్‌టీ ఫీల్డ్‌ అధికారులు గుర్తించారని, 2025 ఆర్థిక సంవత్సరంలో 30,056 జీఎస్టీ ఎగవేత కేసులను గుర్తించినట్లు ప్రభుత్వం లోక్‌సభకు తెలిపింది. ఇందులో సగానికిపైగా ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌కు సంబంధించినవే ఉన్నాయని పేర్కొంది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News