Tuesday, October 28, 2025
ePaper
Homeఅంతర్జాతీయంయూఎస్‌కి చైనా వార్నింగ్

యూఎస్‌కి చైనా వార్నింగ్

తైవాన్ విషయంలో జోక్యం చేసుకోవద్దని మరోసారి హెచ్చరిక

అగ్ర రాజ్యం యూఎస్‌కి చైనా వార్నింగ్ ఇచ్చింది. తైవాన్ విషయంలో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించింది. తైవాన్‌పై చైనా సైనిక శక్తిని ప్రయోగించే అవకాశం ఉందన్న అమెరికా వ్యాఖ్యలపై ఫైర్ అయింది. నిప్పుతో చెలగాటమొద్దని హెచ్చరించింది. తమను కట్టడి చేయటానికి తైవాన్ గొడవను పావుగా వాడుకోవద్దని చైనా.. యూఎస్‌కి హితవు పలికింది. ఈ మేరకు డ్రాగన్ కంట్రీ విదేశాంగ ప్రతినిధి తాజాగా ప్రకటన చేశారు.

అమెరికా రక్షణ శాఖ సెక్రెటరీ పీట్ హెగ్‌సెత్ శనివారం (మే 31న) మాట్లాడుతూ.. తైవాన్ విషయంలో చైనా ప్రణాళికలు ప్రపంచ శాంతికి ప్రమాదకరంగా మారొచ్చని ఆందోళన వెలిబుచ్చారు. ప్రాంతీయ అస్థిరతలను పాడుచేసేలా ఉన్న చైనాను కంట్రోల్ చేయటానికి అమెరికా, దాని మిత్ర దేశాలు ఎంతో చేయాల్సి ఉందని చెప్పారు. హెగ్‌సెత్ చేసిన కామెంట్స్‌పై చైనా అబ్జెక్షన్ చెప్పింది. వాటిని ఖండిస్తున్నట్లు అధికారికంగా వెల్లడించింది. తైవాన్ అనేది తమ అంతర్గత వ్యవహారమని, ఇతర దేశాలు ఇందులో వేలుపెట్టొద్దని పేర్కొంది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News