Saturday, October 4, 2025
ePaper
Homeస్పోర్ట్స్ముంబైపై ‘పంజా’బ్ పైచేయి

ముంబైపై ‘పంజా’బ్ పైచేయి

ఐపీఎల్‌-18లో పంజాబ్ కింగ్స్ జట్టు పదేళ్ల గ్యాప్ తర్వాత ప్లేఆఫ్స్‌కి క్వాలిఫై అయింది. అదే ఉత్సాహంతో క్వాలిఫయర్ ఆడే ఛాన్స్‌నూ కొట్టేసి ఏకంగా టాప్-2లో బెర్త్ ఖరారు చేసుకుంది. లేటెస్ట్‌గా ముంబై ఇండియన్స్‌పై విక్టరీతో 19 పాయింట్లు సాధించింది. తద్వారా టాప్‌లోకి వచ్చేసింది. సోమవారం (మే 26న) జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టీమ్ 7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ని ఓడించింది. తొలుత ముంబై ఇండియన్స్ 7 వికెట్లు కోల్పోయి 184 రన్నులు చేసింది. 185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్ 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.3 ఓవర్లలోనే టార్గెట్ చేరుకుంది. జోష్ ఇంగ్లిష్ 42 బాల్స్ ఆడి 73 రన్నులు చేశాడు. తాజా ఓటమితో పాయింట్ల పట్టికలో ముంబై నాలుగో స్థానంలో ఉండిపోయింది. ఈ రోజు మంగళవారం రాత్రి ఏడున్నరకు చివరి లీగ్ మ్యాచ్ లక్నో, బెంగళూర్ మధ్య జరగనుంది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News