Saturday, October 4, 2025
ePaper
HomeUncategorizedమాతా రమాబాయి.. త్యాగమయి..

మాతా రమాబాయి.. త్యాగమయి..

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ సతీమణి మాతా రమాబాయి. 2025 మే 27 మంగళవారం ఆమె 90వ వర్ధంతి. మాతా రమాబాయి గొప్ప త్యాగమయి. ఆమె గురించి అంబేద్కర్ ఒక సందర్భంలో ఇలా చెప్పారు.. “నేను అమెరికాలో విద్యాభ్యాసం చేసే రోజుల్లో నా చదువు కోసం నా భార్య ఒక పూట తిని, మరో పూట తినక డబ్బు కూడబెట్టి పంపేది”.

అంబేద్కర్ చెప్పినదాన్నిబట్టి ఆ మహాసాధ్వి.. అంకితభావానికి ప్రతిరూపమని అర్థంచేసుకోవచ్చు. ఆ మహాతల్లి నాడు చేసిన త్యాగం ఫలాలను నేడు మనం అనుభవిస్తున్నాం. కాబట్టి మాతా రమాబాయిని మనసారా స్మరించుకుందాం. ఆమె ఘనతను ప్రతి ఒక్కరికీ తెలియజేయడం మన ధర్మం.

మాతా రమాబాయి అంబేద్కర్ మహిళా మండలి, జజ్జనకరి కళా మండలి, అణగారిన ప్రజల హక్కుల పోరాట కమిటీ, గద్దర్ అభిమానుల సంఘం మాతా రమాబాయికి ఘనంగా నివాళులు అర్పించారు. అంబేద్కర్ నగర్ కాలనీ వాసులు, భారతరత్న బీఆర్ అంబేద్కర్, మాతా రమాబాయి అభిమానులు, శ్రేయోభిలాషులు, యువతీయువకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గద్దర్ అభిమానుల సంఘం అధ్యక్షుడు సి.ఎల్.యాదగిరి మాట్లాడుతూ మాతా రమాబాయి ఆశయాలను కొనసాగిద్దామని పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News