Friday, October 3, 2025
ePaper
Homeస్పోర్ట్స్ఫైనల్‌కి వెళ్లేది ఎవరో?

ఫైనల్‌కి వెళ్లేది ఎవరో?

నేడు ముంబై, పంజాబ్ మధ్య పోటీ

ఐపీఎల్‌లో ఇవాళ (జూన్ 1న) క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌ జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌లో ముంబై, పంజాబ్ పోటీపడనున్నాయి. ఈ రోజు గెలిస్తే ఫైనల్‌లోకి అడుగుపెట్టొచ్చు. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్‌కి చేరిన సంగతి తెలిసిందే. ముంబై ఇండియన్స్‌కి ఈ మ్యాచ్‌ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే.. ఈ స్టేడియంలో ఈ టీమ్ రికార్డ్ ఏమాత్రం బాగలేదు. ఇక్కడ ఆడిన 5 సార్లూ ఓటమి తప్పలేదు. 2023 ఐపీఎల్ క్వాలిఫైయర్ 2లో గుజరాత్‌తో ఆడినప్పుడూ పరాజయమే పలకరించింది. ముంబై ఇండియన్స్ ఈ గ్రౌండ్‌లో చివరిసారిగా 2014లో విజయం సాధించింది. అంటే 11 ఏళ్లుగా ఇక్కడ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదని అర్థం. ఈ ఫెయిల్యూర్స్‌కి బ్రేక్ వేయటం ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాకి, కోచ్ మహేల జయవర్ధనేకి సవాల్‌గా నిలిచింది. కాబట్టి ఈ క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చావోరేవో అన్నట్లుగా పోరాడాలి.

RELATED ARTICLES
- Advertisment -

Latest News