Thursday, September 11, 2025
ePaper
spot_img
Homeబిజినెస్తగ్గిన వంట గ్యాస్ ధర

తగ్గిన వంట గ్యాస్ ధర

వంట గ్యాస్ ధర తగ్గింది. వాణిజ్య అవసరాలకు వాడుకునే ఎల్‌పీజీ రేట్లను చమురు సంస్థలు సవరించాయి. 19 కిలోల సిలిండర్‌ ధరను రూ.24 తగ్గించినట్లు ప్రకటించాయి. దీంతో నిత్యం ఈ సిలిండర్లను వినియోగించే రెస్టారెంట్లు, హోటళ్ళు, ఇతర వాణిజ్య సంస్థలకు ఇది పెద్ద రిలీఫ్ అని చెప్పొచ్చు. తగ్గిన రేట్లు తక్షణం అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‎లో రూ.1969, విజయవాడలో రూ.1880.50, ఢిల్లీలో రూ.1,723.50, కోల్‌కతాలో రూ.1,826, ముంబైలో రూ.1,674.50, చెన్నైలో రూ.1,881గా ఉన్నాయి. ఈ ధరలు సిటీలను బట్టి మారతాయి. స్థానిక పన్నులు, రవాణా ఖర్చులు బట్టి ఉంటాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వంటి ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ప్రతి నెలా తొలి రోజున ఏవియేషన్ టర్బైన్ ఇంధనం, వంట గ్యాస్ ధరలను సవరిస్తాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ రేట్లు, విదేశీ మారకపు రేట్లలో హెచ్చుతగ్గులను బట్టి ఉంటాయి. వాణిజ్య సిలిండర్ ధర తగ్గటం ఇది వరుసగా మూడో నెల. మే నెల ప్రారంభంలో రూ.14.50 తగ్గింది. ఏప్రిల్ 1న రూ.41 తగ్గింది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News