Friday, September 12, 2025
ePaper
spot_img
Homeఎన్‌.ఆర్‌.ఐడల్లాస్‌లో బీఆర్ఎస్ రజతోత్సవాలు

డల్లాస్‌లో బీఆర్ఎస్ రజతోత్సవాలు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు సైతం

అమెరికాలోని డల్లాస్‌లో ఇవాళ (జూన్ 1న) బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాలు జరగనున్నాయి. ఈ వేడుకలు సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతాయి. బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఉత్సవాలను అంగరంగ వైభవంగా ఏర్పాటుచేశారు. సెలబ్రేషన్స్‌కి వైదికైన డాక్టర్‌ పెప్పర్‌ ఎరినా ప్రాంగణం మొత్తం గులాబీమయమైంది. ఈ సంబరాల్లో ముఖ్యఅతిథిగా పాల్గొనేందుకు వచ్చిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కి పార్టీ శ్రేణులు, ఎన్ఆర్ఐలు ఘనంగా స్వాగతం పలికారు. మరోవైపు.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను కూడా నిర్వహించనున్నారు. 2 రోజుల లండన్‌ పర్యటన ముగించుకొని కేటీఆర్‌ డాలస్‌ చేరుకున్నారు. పటిష్ట భద్రతతో ప్రత్యేక వాహనాల్లో విడిది ప్రదేశానికి చేరుకున్నారు. బీఆర్‌ఎస్‌ గ్లోబల్‌ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. అమెరికా సంయుక్త రాష్ర్టాల్లోని పలు నగరాల నుంచి తెలంగాణవాదులు ఇప్పటికే డాలస్‌‌కి వచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News