Monday, October 6, 2025
ePaper
Homeతెలంగాణచరిత మరువదు ఎన్టీఆర్ ఘనత

చరిత మరువదు ఎన్టీఆర్ ఘనత

ఎల్‌బీ నగర్ నియోజకవర్గంలోని వనస్థలిపురం ఎన్టీఆర్ చౌరస్తాలో ఎన్టీఆర్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. చౌరస్తాలోని ఎన్టీఆర్‌ విగ్రహానికి GHMC డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి.. జయంతి ఉత్సవాల కమిటీ సభ్యులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నందమూరి తారక రామారావు తెలుగు జాతికి గర్వకారణమని చెప్పారు. నటుడిగా, నాయకుడిగా, ప్రజాసేవకుడిగా ఆయన చరిత్రలో అజరామరంగా నిలిచిపోయారని తెలిపారు.

కొప్పుల నర్సింహ్మా రెడ్డి ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. ఎన్టీఆర్‌ లాంటి మహానుభావుడి జయంతిని జరుపుకోవడాన్ని అదృష్టంగా భావిస్తున్నా. ఆయన సినిమాలు కేవలం వినోదం మాత్రమే పంచలేదు. విలువల పాఠాలు బోధించాయి. ధర్మ మార్గదర్శకాలను నిర్దేశించాయి. రాముడు, కృష్ణుడు, కర్ణుడు, శివుడు తదితర పాత్రల్లో ఎన్టీఆర్‌ ప్రదర్శించిన నటన ప్రతిఒక్కరి గుండెల్లో నిలుస్తుంది. ఎన్టీఆర్ రాజకీయాల్లో ప్రవేశించి తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టారు. తెలుగు ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారు. సామాన్యుల ముఖ్యమంత్రిగా పేదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలుచేశారు. యువత ఎన్టీఆర్ జీవితం నుంచి ప్రేరణ పొంది సమాజం కోసం పనిచేయాలి. ఎన్టీఆర్‌ ఆశయాల సాధన కోసం కృషిచేయడమే ఆయనకు మనం అర్పించే నిజమైన నివాళి.

RELATED ARTICLES
- Advertisment -

Latest News