Friday, October 3, 2025
ePaper
Homeఆంధ్రప్రదేశ్ఏపీ డీజీపీగా బాధ్యతలు చేపట్టిన హరీష్ కుమార్ గుప్తా

ఏపీ డీజీపీగా బాధ్యతలు చేపట్టిన హరీష్ కుమార్ గుప్తా

ఏపీకి పూర్తి స్థాయి డీజీపీగా నియమితులైన హరీష్ కుమార్ గుప్తా శనివారం (మే 31న) పదవీ బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పోలీస్ దళాధిపతిగా బాధ్యతలు చేపట్టారు. ఈయన 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంలో డైరెక్టర్ జనరల్‌గా కొనసాగుతూ ఇన్‌ఛార్జ్ డీజీపీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డీజీపీగా రెండేళ్లు కొనసాగనున్నారు. 4 నెలలుగా ఇన్‌ఛార్జి డీజీపీగా ఉన్న ఆయన పోలీసు శాఖలో తనదైన ముద్ర వేశారు. 2025 జనవరిలో ద్వారకా తిరుమలరావు డీజీపిగా రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వం ఫిబ్రవరి 1వ తేదీ నుంచి హరీష్ కుమార్ గుప్తాకే ఇన్‌ఛార్జిగా అవకాశం ఇచ్చింది. డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన హరీష్ కుమార్ గుప్తాను పలువురు సీనియర్ పోలీసు అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News