Friday, October 3, 2025
ePaper
Homeఅంతర్జాతీయంUS Shooting | అమెరికాలో జరిగిన పోలీసుల కాల్పుల్లో తెలంగాణ యువకుడు మృతి

US Shooting | అమెరికాలో జరిగిన పోలీసుల కాల్పుల్లో తెలంగాణ యువకుడు మృతి

అమెరికాలో దారుణం…అమెరికా పోలీసుల ఘాతుకం…తెలంగాణ కు చెందిన 29 ఏళ్ళ వ్యక్తిని అతి దారుణంగా కాల్చి చంపారు. 2016 లో ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన మహబూబ్ నగర్ కి చెందిన మహ్మద్ నిజాముద్దీన్ ఫ్లోరిడా కళాశాల నుండి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన తరువాత ఒక ప్రైవేట్ కంపెనీ లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. నిజాముద్దీన్ తండ్రి చెప్పిన కధనం ప్రకారం తన కొడుకుని కాల్చి చంపిన వార్త గురువారం తెలిసిందని, తన కొడుకు అస్థికలు హాస్పిటల్ లో ఉన్నాయి అని చెప్పారు. తన కొడుకు మరణంపై సమగ్ర దర్యాప్తు జరగాలని, తన అస్థికలును మహుబూబ్ నగర్ వచ్చేలా చెయ్యాలని నిజాముద్దీన్ తండ్రి హసనుద్దీన్ విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ ను కోరారు.

పోలీసుల కథనం ప్రకారం అమెరికా కాలమానం ప్రకారం గురువారం ఉదయం శాంతా క్లారా పోలీసులకు నిజాముద్దీన్ ఉంటున్న ఇంట్లో గొడవ జరుగుతుంది అని సమాచారం వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని తలుపులు బద్దలు కొట్టి ఇంట్లో కి వెళ్లి చూడగా నిజాముద్దీన్ తన రూమ్ మేట్ పై కత్తి తో దాడి చేస్తున్నట్లు కనిపించాడు. పోలీసులు ఇద్దరినీ చేతులు పైకి ఎత్తమన్నపుడు నిజాముద్దీన్ సహకరించకపోడం తో అతనిపై పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో నిజాముద్దీన్ అక్కడిక్కడే మరణించాడు. ఈ ఘటన పై విచారణ జరుగుతుందని సాంటా క్లారా పోలీసు విభాగం వారు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News