Thursday, September 11, 2025
ePaper
spot_img
Homeతెలంగాణఅనంతగిరిలో 1100 ఏళ్ల నాటి జైన గుహలు

అనంతగిరిలో 1100 ఏళ్ల నాటి జైన గుహలు

కాపాడుకోవాలని డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి సూచన

వికారాబాద్ జిల్లాలోని అనంతగిరిలో ఉన్న 9వ శతాబ్దం నాటి 15 జైన గుహల సముదాయాలను ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ, పురావస్తు పరిశోధకులు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి శనివారం (2025 మే 31న) సందర్శించారు. ఈ గుహలు చతురస్రాకారం, దీర్ఘచతురస్రాకారంలో ఉన్నాయి. 2 నుంచి 6 మీటర్ల పొడవు, 2 నుంచి 3 మీటర్ల వెడల్పు, 2.5 మీటర్ల ఎత్తు కలిగి ఉన్నాయి. తూర్పు వైపు ద్వారంతో నేలపై రాతి పడకలు కలిగి ఉన్నాయి. వర్షా కాలంలో జైన మునులు ఈ గుహల్లో నివసించేవారు. మరణించేంత వరకు
ఆహారం తీసుకోకుండా ఈ పడకల పైనే సల్లేఖన వ్రతాన్ని ఆచరించేవారు.

ఒక గుహలో పద్మాసనంలో ఉన్న జైన తీర్ధంకరుడి విగ్రహాన్ని పరిశీలించి ఈ గుహలు క్రీస్తు శకం 9 వ శతాబ్ద (రాష్ట్రకూటుల) కాలానికి చెందినవని శివనాగిరెడ్డి తెలిపారు. చారిత్రక ప్రాధాన్యత కల 1100 ఏళ్ల నాటి ఈ జైన గుహలను కాపాడాలని ఆలయ, వికారాబాద్ పురపాలక సంఘ అధికారులకు సూచించారు. వాటిని కాపాడటానికి ఆలయ చైర్మన్ డాక్టర్ పద్మనాభం సహకారం అందిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వారసత్వ కట్టడాల కార్యకర్తలు డీఆర్ శ్యామ్ సుందర్ రావు, బి.వెంకటరెడ్డి, బి.సాయి కిరణ్ రెడ్డి, ఎల్లయ్య పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News