Wednesday, October 29, 2025
ePaper
Homeసినిమామాచో స్టార్ గోపీచంద్‌ హీరోగా నూత‌న చిత్రం

మాచో స్టార్ గోపీచంద్‌ హీరోగా నూత‌న చిత్రం

ప్రతిష్టాత్మకమైన, అత్యంత విజయవంతమైన నిర్మాణ సంస్థ, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతోంది. ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ మార్గదర్శకత్వంలో వరుసగా సక్సెస్‌లను సాధిస్తోంది. ప్రస్తుతం ఈ ఈ విజయవంతమైన నిర్మాణ సంస్థ మాచో స్టార్ గోపీచంద్‌తో సినిమా చేయబోతోంది. ‘సాహసం’ తర్వాత గోపీచంద్ మళ్లీ ఈ బ్యానర్‌లో సినిమా చేస్తున్నారు. అలాంటి ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురువారం (ఏప్రిల్ 24) నాడు అధికారికంగా ప్రారంభమైంది. ఈ ఆసక్తికరమైన థ్రిల్లర్‌తో కుమార్ సాయి దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. సాహసం తర్వాత ప్రతిభావంతులైన సినిమాటోగ్రాఫర్ శామ్‌దత్ ISC కూడా ఈ టీంలో జాయిన్ అయ్యారు. ఈ టీం బాక్సాఫీస్ వద్ద మరో సారి సంచలనాన్ని సృష్టిస్తుండటం ఖాయమనిపిస్తోంది. అద్భుతమైన కథనం, గోపీచంద్ యాక్షన్, హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో ఈ చిత్రం రాబోతోంది. ఈ మూవీ అత్యున్నత స్థాయి నిర్మాణ విలువలతో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మలయాళ నటి మీనాక్షి దినేష్ ఈ థ్రిల్లర్‌లో గోపీచంద్ సరసన కథానాయికగా నటించనుంది. బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, బాపినీడు సమర్పిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. నటీనటులు, ఇతర సిబ్బంది గురించి మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News