Saturday, October 4, 2025
ePaper
Homeతెలంగాణజూన్ 1 నుంచి 3 నెలల సన్నబియ్యం ఒకేసారి

జూన్ 1 నుంచి 3 నెలల సన్నబియ్యం ఒకేసారి

జూన్ 1 నుంచి పంపిణీ

ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 3 నెలల సన్నబియ్యాన్ని ఒకేసారి ఇవ్వనుంది. జూన్ 1 ఆదివారం నుంచి వీటిని పంపిణీ చేయనుంది. రోజూ పొద్దున్నే 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు చౌక ధరల దుకాణాలను తెరిచి ఉంచుతారు. ఈ మేరకు సివిల్‌ సప్లయిస్‌ విభాగం ఉత్తర్వులను జారీ చేసింది. గతంలో నెలకొకసారి బియ్యం పంపిణీ చేసేవారు. ఈసారి మాత్రం జూన్‌, జూలై, ఆగస్టు నెలల్లో ఇవ్వాల్సిన సన్న బియ్యాన్ని ఒకేసారి ఇస్తారు. జూన్‌ నెలలోని అన్ని రోజులూ రేషన్‌ షాపులు ఓపెన్ చేసే ఉంటాయి. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం కోరింది. జూన్ తర్వాత సన్నబియ్యం పంపిణీ తిరిగి సెప్టెంబర్‌లో ప్రారంభం కానుంది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News