Saturday, October 4, 2025
ePaper
Homeస్పోర్ట్స్కరుణ్‌ నాయర్‌ డబుల్ సెంచరీ

కరుణ్‌ నాయర్‌ డబుల్ సెంచరీ

ఇంగ్లాండ్‌ లయన్స్‌తో జరిగిన అనఫిషియల్ టెస్ట్ మ్యాచ్‌లో కరుణ్‌ నాయర్‌ డబుల్‌ సెంచరీ చేశాడు. కాంటర్‌బరీలో ఇండియా-ఏ, ఇంగ్లాండ్‌ లయన్స్‌ మధ్య 4 రోజుల మ్యాచ్‌ శుక్రవారం (మే 30న) మొదలైంది. ఇండియా సీనియర్ టీమ్ పర్యటనకు ముందు సన్నాహకంగా ఇంగ్లాండ్ లయన్స్‌తో 2 మ్యాచ్‌ల సిరీస్ కోసం బీసీసీఐ కొంత మంది ఆటగాళ్లను పంపింది. ఫస్ట్ మ్యాచ్‌లో కరుణ్ 3వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. తొలి రోజే శతకం బాదాడు. ఆట ముగిసే సమయానికి 186 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. 2వ రోజు ఫోర్‌ కొట్టి ద్విశతకం పూర్తి చేశాడు. టీమిండియా 557 పరుగులకు ఆలౌట్ అయింది. కరుణ్‌ నాయర్‌ 281 బాల్స్ ఆడి 26 ఫోర్లు, ఒక సిక్సర్‌తో మొత్తం 204 రన్నులు చేసి ఔట్‌ అయ్యాడు. సర్ఫరాజ్ కొద్దిలో సెంచరీ చేసే ఛాన్స్ కోల్పోయాడు. 119 బంతుల్లో 13 ఫోర్లతో 92 రన్నులు చేసి తర్వాత పెవిలియన్‌కి చేరాడు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News