Saturday, October 4, 2025
ePaper
Homeక్రైమ్ వార్తలు‘కన్నప్ప’కు కన్నమేసి జంప్

‘కన్నప్ప’కు కన్నమేసి జంప్

మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా హార్డ్ డ్రైవ్‌ను ఇద్దరు వ్యక్తులు చోరీ చేశారు. ఆ మూవీకి సంబంధించిన అత్యంత కీలకమైన కంటెంట్ ఉన్న హార్డ్ డ్రైవ్‌ను ముంబైలోని హెచ్ఐవీఈ స్టూడియోస్.. డీటీడీసీ కొరియర్ ద్వారా హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని ఫోర్ ఫ్రేమ్స్ సంస్థకు పంపింది. ఆ పార్సిల్‌ను ఈ నెల 25న ఆఫీస్ బాయ్ రఘు తీసుకొని చరిత అనే మహిళకు అందించాడు. అప్పటి నుంచి వాళ్లిద్దరూ కనిపించకుండా పోయారు. దీంతో ఫోర్ ఫ్రేమ్స్ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొంత మంది పెద్దవాళ్లు తమ సినిమాకు నష్టం కలిగించాలనే ఉద్దేశంతో కుట్ర చేస్తున్నారని ఆరోపించింది. నిందితులిద్దరిని పట్టుకొని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News