Monday, October 6, 2025
ePaper
Homeక్రైమ్ వార్తలుఏసీబీ వలలో ముషీరాబాద్‌ ఆర్‌ఐ

ఏసీబీ వలలో ముషీరాబాద్‌ ఆర్‌ఐ

హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌ తహశీల్దార్‌ కార్యాలయంలో ఆర్‌ఐగా పనిచేస్తున్న భూపాల మహేశ్‌ అవినీతి నిరోధక శాఖ వలకు చిక్కాడు. కుటుంబ సభ్యుడి సర్టిఫికెట్‌ ఇచ్చేందుకు లక్ష రూపాయలు లంచం డిమాండ్‌ చేసి, అందులో 25 వేలు తీసుకుంటూ 2025 మే 28న ఏసీబీ సిటీ రేంజ్‌ యూనిట్‌-2 అధికారులకు దొరికిపోయాడు. ఏసీబీ అధికారులు నిందితుణ్ని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకొని నగదును స్వాధీనం చేసుకున్నారు. భూపాల మహేశ్‌పై కేసు బుక్‌ చేసి అదుపులోకి తీసుకున్నామని, నాంపల్లిలోని కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.

కాల్‌ చేయండి

ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్‌ చేస్తే ప్రజలు టోల్‌ఫ్రీ నంబర్‌ 1064కి కాల్‌ చేయాలని ఏసీబీ సూచించింది. వాట్సాప్‌ నంబర్‌ 9440446106కి ఫిర్యాదు చేయొచ్చని తెలిపింది. ఫిర్యాదుదారుల లేదా బాధితుల వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News