Sunday, September 8, 2024
spot_img

అద్వానంగా మారిన శంకర్‌పల్లి వికారాబాద్‌ రోడ్డు..

తప్పక చదవండి
  • మరమ్మత్తులపై దృష్టి సారించని
    ఆర్‌ అండ్‌ బీ అధికారులు..
  • నిత్యం నరకం అనుభవిస్తున్న వాహనదారులు..
  • గుంతల వల్ల పాడైన లారీ..

శంకర్‌ పల్లి : శంకర్‌ పల్లి మండలం, మున్సిపల్‌లో పలకులు, అధికారులు చెబుతున్న మాటలు ఆచరణలో కనిపించడం లేదు.ఆయా గ్రామాలకు, వికారాబాద్‌, బంటారం వెళ్లేందుకు రహదారి సౌకర్యం సరిగ్గా లేక వాహనదారులు ఇక్కట్లకు గురవుతున్నారు. రోడ్డుపై అడుగడుగునా ఏర్పడిన గుంతలతో నిత్యం నరకం అనుభవిస్తున్నారు. యేండ్లు గడుస్తున్నాయే తప్ప అధికారులలో మాత్రం స్పందన కరువైంది. మండలంలోని మరియు మున్సిపల్‌ లలో ప్రధాన రహదారులు గుంతల మయంగా మారడంతో వాహనదారులంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారుల పర్యవేక్షణ కరువై పనుల్లో నాణ్యత లోపించడం కొన్నాళ్లకే రహదారులు చిత్రంగా మారిపోవడం. దీంతో ఈ రోడ్ల గుండా వెళ్లాలంటేనే వాహనాదారులు జంకుతున్నారు. ఈ దారి గుండానే నిత్యం వేల మంది ప్రయాణికులు ప్రయా ణిస్తుం టారు. మధ్యరాత్రి రెండు గంటల నుంచి వికారా బాద్‌, మోమిన్‌ పేట్‌, దేవరం పల్లి, నవాపేట్‌, మర్పల్లి, బంటారం ఇలా పలు గ్రామాల నుండి నిత్యం రైతులు తమ కూరగా యలు, పువ్వులు తీసుకొని గుడిమల్కాపూర్‌, బోయిన్పల్లి, పటాన్చెరు పలు మార్కెట్లకు నిత్యం తమ ప్రయాణం కొనసాగిస్తుంటారు. రోడ్డుపై ఏర్పడిన గుంతల వల్ల నిత్యం రైతులు ఏదో ఒక విధంగా నష్టపోతూనే ఉన్నారు. ఒకవైపు భారీ వాహనాలు ఈ దారి గుండానే హైదరాబాద్‌, బెంగళూరు పలు ప్రాంతాలకు ప్రయాణం కొనసాగిస్తుంటారు. గుంతల మయంగా ఏర్పడిన రోడ్లతో వాహనాలు చెడిపోవడం, చెడిపోయిన వాహనం బాగు చేయాలంటే రెండు, మూడు రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి దీనివలన మరుసటి రోజు సరుకు తీసుకుపోదామన్నా వాహనం చెడిపోవడంతో భారీగా నష్టపోతున్న వాహనదారులు, ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకుని రోడ్డు మరమ్మత్తులు చేయాలని అటు వాహనదారులు, ప్రయాణికులు అధికారులను వేడుకుంటున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు