Sunday, September 8, 2024
spot_img

ఇంఫాల్‌ ఎయిర్‌పోర్ట్‌ వద్ద గుర్తు తెలియని ఎగిరే వస్తువు కలకలం…

తప్పక చదవండి
  • ఘటన చూసి వెంటనే స్పందించిన ఎయిర్‌ఫోర్స్‌

ఇంఫాల్‌ : మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌ ఎయిర్‌పోర్ట్‌ వద్ద గుర్తు తెలియని ఎగిరే వస్తువు కలకలం రేపింది.ఈ విషయం తెలిసిన వెంటనే ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ స్పందించింది. రెండు రాఫెల్‌ ఫైటర్‌ జెట్లను రంగంలోకి దించింది. భారత వాయుసేన ఈ విషయాన్ని సోమవారం ధృవీకరించింది. ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఇంఫాల్‌ ఎయిర్‌పోర్ట్‌ వద్ద గుర్తు తెలియని ఎగిరే వస్తువు కనిపించినట్లు తమకు సమాచారం అందినట్లు తెలిపింది. దీంతో పశ్చిమ బెంగాల్‌లోని హషిమారా ఎయిర్‌బేస్‌లో మోహరించిన రాఫెల్ యుద్ధ విమానాల్లో రెండు గాల్లోకి లేచాయని పేర్కొంది.రెండు రాఫెల్‌ జెట్లు యూఎఫ్‌వో కోసం అంతటా వెతికాయని, అయితే దాని జాడ ఎక్కడా కనిపించలేదని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఆ యూఎఫ్‌వోను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నాయి. అలాగే షిల్లాంగ్ ప్రధాన కార్యాలయంగా పని చేస్తున్న భారత వైమానిక దళానికి చెందిన ఈస్టర్న్ కమాండ్ వెంటనే ఎయిర్ డిఫెన్స్ రెస్పాన్స్ మెకానిజాన్ని యాక్టివేట్ చేసినట్లు వెల్లడించాయి.
మరోవైపు ఇంఫాల్‌ ఎయిర్‌పోర్ట్‌ సమీపంలో యూఎఫ్‌వో కనిపించిన వీడియో క్లిప్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఈ సంఘటన నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం ఆ ఎయిర్‌పోర్ట్‌ నుంచి విమాన రాకపోకలను నిలిపివేశారు. అక్కడ దిగాల్సిన విమానాలను ఇతర ఎయిర్‌పోర్ట్‌లకు మళ్లించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు