Sunday, September 8, 2024
spot_img

ఐదు రాష్ట్రాల్లో పెరిగిన మ‌హిళా ఓటర్లు..

తప్పక చదవండి

న్యూఢిల్లీ : తెలంగాణతో పాటు ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, రాజ‌స్థాన్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, మిజోరాం రాష్ట్ష్ట్రాల‌కు ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌లైంది. ఈ ఐదు రాష్ట్రాల్లో మ‌హిళా ఓట‌ర్ల సంఖ్య పెరిగిన‌ట్లు సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. తెలంగాణ‌లో 2018 ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌తి వెయ్యి మంది పురుషుల‌కు మ‌హిళా ఓట‌ర్లు 992 మంది ఉంటే, ప్ర‌స్తుతం ఆ సంఖ్య 998కి చేరింది. ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో 2018లో 995 మ‌హిళా ఓటర్లు ఉంటే.. ప్ర‌స్తుతం ఆ సంఖ్య 1012కు చేరింది. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో 2018లో 917 ఉంటే, ఇప్పుడు 945కు చేరింది. మిజోరాంలో 2018లో 1051 ఉంటే, ఇప్పుడు ఆ సంఖ్య 1063కు చేరింది. రాజ‌స్థాన్‌లో 914 మంది ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 920కి చేరిన‌ట్లు సీఈసీ పేర్కొన్నారు. ఇక మిజోరాంలో మ‌హిళ‌ల‌కు ప్ర‌త్యేకంగా 95 పోలింగ్ కేంద్రాలు, తెలంగాణ‌లో 597, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో 900, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో 5000, రాజ‌స్థాన్‌లో 1600 పోలింగ్ స్టేష‌న్లు ఏర్పాటు చేశారు. ఈ ఐదు రాష్ట్రాల్లో 7.8 కోట్ల మ‌హిళ‌లు త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకోనున్నారు. తెలంగాణ‌లో 1.58 కోట్ల మంది మ‌హిళా ఓట‌ర్లు ఉన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు