Sunday, September 8, 2024
spot_img

రేవంత్‌ రెడ్డి హయాంలో జర్నలిస్టుల కల నెరవేరేనా?

తప్పక చదవండి
  • పదేళ్లుగా ఇళ్ల స్థలాల కోసం ఆశగా ఎదురుచూస్తున్న జర్నలిస్టులు…
  • స్వరాష్ట్రంలో నెరవేరని జర్నలిస్టుల కల

మెదక్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): స్వరాష్ట్రంలో స్వప్నం నెరవేరక బంగారు తెలంగాణలో భవిత్యం కానరాక ఇళ్ల స్థలాల కోసం పదేళ్లుగా కళ్ళు కాయలు చేసుకుని ఎదురు చూస్తున్న జర్నలిస్టుల కల రేవంత్‌ రెడ్డి హయాంలో నెరవేరు తుందా..? తెలంగాణ ఉద్యమానికి ఊపిరి లూధినా జర్నలిస్టు లను గత పాలకులు నిర్లక్ష్యం చేసిన నేపథ్యంలో ఇప్పుడైనా తమ కల నెరవేరుతుందా అని తెలంగాణ గడ్డపై కొత్తగా కొలువు తీరబోతున్న కాంగ్రెస్‌ సర్కార్‌ పై జర్నలిస్టులు ఆశగా ఎదురు చూస్తున్నారు. జర్నలిస్టులు ప్రజాస్వామ్య వ్యవస్థకు మూల స్తంభ మైన జర్నలిస్టుల బతుకులు స్వరాష్ట్రంలో పూర్తిగా నిర్విర్య అయ్యా యని చెప్పాలి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జర్నలి స్టులు అంటే ఒక గౌరవం, ఒక విలువ బాగుండేది. జర్నలిస్టుల అభిప్రాయాలను గౌరవిస్తూనే వారు వార్తల రూపంలో వేలెత్తి చూపే అంశాలను పరిగణలోనికి తీసుకునేవారు గత పాలకులు. జర్నలిస్టులు నోరు తెరిచి ఇది మా సమస్య అని చెప్పుకోవలసిన పరిస్థితి ఉండేది కాదు. ఒకవేళ నోరు తెరిచి అడిగితే ఆలస్యం గానే సరే వారి సమస్యలను పరిష్కరించే వారు గత పాలకులు. కానీ స్వరాష్ట్రంలో జర్నలిస్టుల బతుకులు పూర్తిగా మారిపో యాయి ఎంతగా మారిపోయాయి అంటే పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టు అయింది. తెలంగాణ ఉద్యమం ఉ వ్వెత్తున సాగుతున్న సమయంలో ఉద్యమానికి ఊపిరి లూధియారు తెలం గాణ జర్నలిస్టులు, గల్లీలో మొదలైన ఉద్యమాన్ని ఢల్లీి దాకా దాటించింది జర్నలిస్టులే. తెలంగాణ ఉద్యమానికి ప్రపంచానికి చాటడంతో పాటు ఢల్లీి మెడలు వంచి తెలంగాణ స్వప్నాని సహకారం చేసేలా చేశారు జర్నలిస్టులు. అయితే ఇందుకు కారణం లేకపోలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో సాయం జరగడం లేదు. కనీసం సొంత రాష్ట్రం ఉంటే మన సమస్యలు తొందరగా పరిష్కారం అవుతాయని ఆశించారు. తెలంగాణ జర్నలిస్టులు ఈ కారణంగానే జర్నలిస్టులు తెలంగాణ ఉద్యమానికి అండగా నిలిచారు. ఉద్యమానికి ఊపిరి లోది ప్రపంచానికి చాటారు ఫలితంగా 2023లో కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల కోట్లాదిమంది తెలంగాణ ప్రజానీకంతో పాటు జర్నలిస్టులు ఎంతో సంబరపడ్డారు. కానీ అనుభవం అయితే తప్ప అన్నట్లుగా స్వరాష్ట్రం ఏర్పాటు అయ్యాక జర్నలిస్టులకు తత్వం బోధ పడలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పాలకులు అవలంబించిన నియంత్రత్వ పోవడలతో జర్నలిస్టుల బతుకులు పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టు అయింది. తూతు మంత్రముగా ప్రభుత్వ మంజూరు చేసిన హెల్త్‌ కార్డులు పనిచేయక, ఇళ్ల స్థలాల సమస్య నెరవేరక ఆర్థిక సమస్యలతో అర్ధాకరితో తణుకు చాలించిన జర్నలిస్టులు కోకొల్లలు..
కరోనా వేల ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తించిన జర్నలిస్టులు….?
ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం సృష్టిస్తున్న వేళ వైద్యులు, పోలీసులతో సమానంగా జర్నలిస్టులు ప్రాణాలకు తెగించి వీధులు నిర్వహించారు. ఫలితం తెలంగాణలో కరోనా కాటుకు గురై వైద్యం చేయించుకునేందుకు సరైన ఆర్థిక స్థోమత లేక అసువులు బారిన జర్నలిస్టులు ఎందరో ఉన్నారు. కానీ కరోనా కాటుకు బలైపోయిన ఏ ఒక్క జర్నలిస్టు కుటుంబాలను బంగారు తెలంగాణ పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదు. ఇదిలా ఉండగా ఉమ్మడి రాష్ట్రం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే సంప్రదాయం ఉండేది. కానీ స్వరాష్ట్రం ఏర్పాటు అయ్యాక జర్నలిస్టుల ఆశలపై నీళ్లు చల్లారు పాలకులు. దీనితో గడిచిన 10 సంవత్సరాలుగా ఇళ్ళ స్థలాలతోపాటు, హెల్త్‌ కార్డుల సమస్య పరిష్కారం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో మార్పుకు సంకేతంగా తెలంగాణ ప్రజల బంగారు తెలంగాణ పాలకులకు బుద్ధి చెప్పి కాంగ్రెస్‌ పార్టీకి అధికారం కట్టబెట్టారు. ఈ నేపథ్యంలో రేవంత్‌ రెడ్డి సారథ్యంలో ఏర్పాటు కాబోతున్న కాంగ్రెస్‌ సర్కార్‌ పై తెలంగాణ జర్నలిస్టులు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాక జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తారని అందరూ ఆశాభావంతో ఉన్నారు. ఇప్పటికైనా తెలంగాణ జర్నలిస్టుల స్వప్నం సాకారం అవుతుందో లేదో వేచి చూడాల్సిందే.?

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు