Sunday, September 8, 2024
spot_img

ప్రజల కోసం పనిచేయని అధికారులెందుకు..?

తప్పక చదవండి
  • నిర్లక్షపు వైఖరిలో విద్యుత్‌ లైన్‌ మెన్‌ లచ్చ..
  • ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు..?
  • ప్రజల, రైతుల ప్రాణాలతో చెలగాటమా..?
  • లైన్‌ మెన్‌, జూనియర్‌ లైన్‌ మెన్‌లపై చర్యలు
    తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్‌..

    దిండి : దిండి మండలం, ఎర్రగుంటపల్లి గ్రామం పరిధిలో విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యానికి ఎర్రగుంటపల్లి గ్రామం చీకటిగా మారిపో తోంది.. వివరాల్లోకి వెళ్తే.. ఎర్రగుంట పల్లి గ్రామం పరిధిలో గ్రామానికి విద్యుత్‌ సరఫరా అందించడానికి 11 కెవి నుండి తగ్గించి బుడ్డీల రూపంలో వీధులకు విద్యుత్‌ సరఫరా చేయడం జరుగుతోంది.. గడిచిన ఎండాకాలంలో ఎన్నో విద్యుత్‌ సమస్యలను ఉన్నా పట్టించుకోకుండా.. గ్రామానికి సంబంధించిన లైన్‌ మెన్‌ చిన్న సమస్యలను కూడా నిర్లక్ష్యం చేస్తూ దాటవేసే సమాధానాలు చేబుతూ పబ్బం గడిపించుకొని పోయాడని.. వానకాలం వచ్చి నెలలు గడుస్తున్నా విద్యుత్‌ సమస్యలు ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉందని.. వర్షాకాలం కావడంతో ఇండ్లలోకి పాములు, తేళ్లు విపరీతంగా వస్తున్నాయని.. ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా తమకేమీ పట్టనట్లు ఆయన వ్యవహరిస్తున్నాడని గ్రామ ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు.. ఇది ఇలా ఉండగా ఇదే గ్రామంలో దళితవాడలకు సంబంధించిన ఒక బుడ్డి చిన్నపాటి రిపేర్లు ఉన్నాయని తీసివేసి, గత కొన్ని ఏళ్ళు గడుస్తున్నా.. ఆ బుడ్డిని మళ్లీ యధావిధిగా నడిపించకుండా.. అంగన్వాడి బడి వద్దనే వదిలేయడం ఎంతవరకు సబబు అని గ్రామ యువకులు ప్రశ్నించినా సమాధానం ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. వర్షాకాలం కావడంతో మరో బుడ్డి చుట్టూ చెట్లు అలుముకునా దానిని కూడా పట్టించుకునే నాధుడే లేడని.. చెట్లను ఆనుకుని ఉన్న ఆ బుడ్డి వల్ల గ్రామంలో షార్ట్‌ సర్క్యూట్‌ అయితే, ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఎంత హెచ్చరించినా పట్టించుకోక పోవడం.. అంతేకాకుండా ఎర్రగుంటపల్లి గ్రామం ఒకటే కాదని, తన పరిధిలో ఉన్న ఎన్నో గ్రామాల్లో ఇలాంటి సమస్యలను ప్రజలు, రైతులు తీవ్రంగా ఎదుర్కొంటున్నారని వాటిని పట్టించుకోకపోగా, చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని.. తెలుస్తోంది.. ఇది ఎంతవరకు సబబని వారు ప్రశ్నిస్తున్నారు.. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకుని లైన్‌ మెన్‌ లచ్చ, జూనియర్‌ లైన్‌ మెన్‌ లపై చర్యలు చేపట్టి, రైతులకు, ప్రజలకు అందుబాటులో ఉండే అధికారులను సమకూర్చాలని ప్రజలు కోరుతున్నారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు