Sunday, September 8, 2024
spot_img

గ్రంధాలయామా ఎక్కడ నీ చిరునామా…?

తప్పక చదవండి
  • విజ్ఞాన భాండాగారాలు లేని జల్పల్లి మున్సిపాలిటీ
    జల్ పల్లి : మహేశ్వరం నియోజకవర్గంలో నాలుగు గ్రామ పంచాయతీ లను కలుపుతూ 2016వ సంవత్సరంలో 33 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి 28 వార్డులతో ఏర్పాటై ఉన్న జల్ పల్లి పురపాలక సంఘంలో ఉన్న గృహ నిర్మాణ భవనాల ట్యాక్స్ లో 8% గ్రంధాలయ పన్ను వసూలు చేస్తునా మున్సిపాలిటీ అధికారులు కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ స్థానిక ఎమ్మెల్యే విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి ఇప్పటి వరకు ఒక్క గ్రంధాలయ భవనం ఏర్పాటు చేసే ప్రయత్నం చేయకపోవడం విచారకరం. జల్పల్లి పురపాలక సంఘంలో 2011వ సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం సుమారు 23,961 నివాస కుటుంబాలు ఉండి 80,374 జనసాంద్రత కలిగిన ఉన్న మున్సిపాలిటీ అదికాస్త 2023 వరకు సుమారు 7 సంవత్సరాలలో జనసాంద్రత తోపాటు నివాస భవనాలు, కుటుంబాలు రెట్టింపు అయి ఉంటాయని అంచనా…. ఒకప్పుడు విద్యార్థులకు, విద్యావంతులకు, ప్రజలను మేలుకొలిపె జాగృత జ్యోతులుగా, సామాజిక విజ్ఞాన కేంద్రాలుగా, సాంఘిక ఉద్యమాలకు వ్యూహ నిర్మాణ స్థావరాలుగా, అక్షర కేంద్రాలుగా, సమర యోధుల సమావేశ వేదికలుగా ఎంత గానో ఉపయోగపడే గ్రంధాలయా భవనాలు లేకపోవడంతో నేటి యువత అసలు చదవటం తగ్గించి ఫోన్ లతోనే కాలక్షేపము చేస్తూ సంఘం యెడల బాధ్యతగా ఉండే విజ్ఞానాన్ని ఆదరణను కోల్పోతున్నారు. గతంలో నాలుగు గ్రామా పంచాయతీ లుగా ఉన్నపుడు పహాడీషరీఫ్ గ్రామపంచాయతీలో గ్రంధాలయం భవనం మాత్రం ఉండేది. అదికాస్తా ఇప్పుడు కనుమరుగై పహాడీషరీఫ్ తపాలా కార్యాలయంగా మారింది. జల్ పల్లి మున్సిపాలిటీలో జనసాంద్రతకు తగట్టుగా కనీసం నాలుగు ముఖ్య ప్రాంతాలలో గ్రంధాలయా భవనాలు ఏర్పాటు చేయాలనీ విద్యావంతులు, స్థానిక ప్రజలు తమ నియోజకవర్గం ఎమ్మెల్యే రాష్ట్ర విద్యాశాఖ మంత్రిని కోరుతున్నారు. పహాడీషరీఫ్ గ్రామంలో గ్రంధాలయని ఏర్పాటు చేయండి…. ముహమ్మద్ -ముజాహిద్, ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి, పహాడీషరీఫ్ గ్రామం జల్పల్లి పురపాలక సంఘంలో 12, 13, 14, 15 నాలుగు వార్డులకు కలుపుకొని ఉన్న పహాడీషరీఫ్ గ్రామంలో మూడు ప్రభుత్వ పాఠశాల తోపాటు సుమారు అయిదు వరకు ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో అనేక మంది విద్యార్థిని, విద్యార్థులు చదువును అభ్యసిస్తున్నారు. ఇలాంటి ప్రాంతంలో విద్యార్థులకు తాము చదువుకొనే పుస్తకాలు చదువు తోపాటు ప్రపంచ విజ్ఞానాన్ని అందించే పుస్తకాలు చదివే అలవాటు చేసుకో పదానికి, మేధా సంపత్తిని పెంపొందించేందుకు గ్రంధాలయాలు దోహదపడుతాయని, గ్రంథాలయాల వల్లనే అనేక మంది విద్యా ర్థులు వివిధ రకాల ఉద్యోగాలు సాధించుటకు మార్గం సులభమ పుతుందని అన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ప్రాతినిత్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఉన్న జలపల్లి మున్సిపాలిటీలో కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతున్న అభివృద్ధి పనుల తోపాటు మాలాంటి విద్యార్థులకు, భావితరాల పౌరులకు ఉపయోగపడే గ్రంధాలయం భవనాని ఏర్పాటు చేసి వాటి అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించాలని కోరుతున్నాను. గ్రంధాలయం కొరకు స్థలాన్ని పరిశీలిస్తున్నాము కమిషనర్ ఎన్. వసంత్ రెడ్డి, జల్ పల్లి పురపాలక సంఘం…. జల్ పల్లి పురపాలక సంఘంలో గ్రంధాలయం భవన నిర్మాణం మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే, విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి సిద్ధంగా ఉన్నారని, అందుకోసం మున్సిపాలిటీ ప్రజలందరికి అందుబాటులో ఉండేందుకు తగిన స్థలం షాహీన్ నగర్ పరిసర ప్రాంతంలో పరిశీలిస్తున్నామని, ఎవరైనా దాతలు ముందుకొచ్చి గ్రంథాలయానికి సరిపడా స్థలాన్ని అందిస్తే ప్రభుత్వ నిధులతో పక్క గ్రంథాలయ భవనాన్ని నిర్మిస్తామని అన్నారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు