Sunday, September 8, 2024
spot_img

మల్కాజిగిరి నియోజకవర్గానికి మైనంపల్లి చేసింది ఏం లేదు

తప్పక చదవండి
  • బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి మర్రి రాజశేఖర్‌ రెడ్డి
  • ఉద్యమకారులను పరిగెత్తించిన చరిత్ర మైనంపల్లిది : బద్దం పరశురాం రెడ్డి
  • అసెంబ్లీలో తక్కువ అటెండెన్స్‌ ఉన్న నాయకుడు ఏకైక ఎమ్మెల్యే మైనంపల్లిదే..
  • బీఆర్‌ఎస్‌ పథకాలే ప్రజలకు శ్రీరామరక్ష..
  • నాయకులను బయపెడితే ఊరుకునేది లేదు : మర్రి రాజశేఖర్‌ రెడ్డి

మల్కాజిగిరి : బి ఫామ్‌ వచ్చిన సందర్బంగా, మల్కాజిగిరి నియోజకవర్గం నేరేడ్మెట్‌ డివిజన్‌ పరిధిలోని టిఆర్‌ఎస్‌ నాయకులు బద్దం పరుశురాం రెడ్డి నివాసంలో పాత్రికేయాల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా,ఏంబిసి చైర్మన్‌ నందికంటి శ్రీధర్‌,బిఆర్‌ఎస్‌ అభ్యర్ధి మర్రి రాజశేఖర్‌ రెడ్డి,గౌతమ్‌ నగర్‌ మాజీ కార్పొరేటర్‌ శిరీష జితేందర్‌ రెడ్డి, సీనియర్‌ నాయకుడు ఆర్‌.జితేందర్‌ రెడ్డి లు హాజరయ్యారు.ఈ సందర్బంగా బిఅర్‌ఎస్‌ అభ్యర్ధి మర్రి రాజశేఖర్‌ రెడ్డి మాట్లాడుతూ,అరుంధతి హాస్పిటల్‌ ద్వారా వేల మంది ప్రజలకు సేవ చేస్తున్నం అన్నారు.మల్కాజిగిరి నియోజకవర్గంలో ప్రధాన సమస్యలు వాజ్పాయ్‌ నగర్‌ రైల్వే గేట్‌,వర్షాల వల్ల నీట మునుగుతున్న లోటట్టు ప్రాంతాలను అభివృద్ధి చేయడం,మల్లికార్జున నగర్‌ లో ఉన్న యుఎల్సి సమస్యలను తీర్చడం తన ప్రధాన అజెండా అని తెలిపారు.మల్కాజిగిరి కి మైనంపల్లి చేసింది ఏం లేదు అన్నారు.బిఆర్‌ఎస్‌ నాయకుడు పరశురాం మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి అన్నీ విధాలుగా కృషి చేస్తాం అని అన్నారు.బద్దం పరశురాం రెడ్డి మాట్లాడుతూ, ఉద్యమకారులను పరిగెట్టిచిన చరిత్ర మైనంపల్లి ది అన్నారు.బిఆర్‌ఎస్‌ పార్టీ గ్రేటర్‌ హైదరాబాద్‌ గ, ఎంపి గా, ఏం ఎల్‌ సి గా, ఎమ్మెల్యే గా అవకాశం ఇచ్చిన ముఖ్య మంత్రి కెసిఆర్‌ నీ తిట్టడం దారుణం అని,లేనిపోని ఆరోపణలు బిఆర్‌ఎస్‌ నాయకులు పైన చేస్తే మైనంపల్లి మీద కేసులు వెస్తం అని మీడియా కు తెలియచేశారు.ఎంబిసి నందికంటి శ్రీధర్‌ మాట్లాడుతూ బిఅర్‌ఎస్‌ ప్రవేశపెట్టిన పధకలను ప్రజల్లోకి తీసుకెళ్లి బిఆర్‌ఎస్‌ జెండా ఎగురవేసిం అని అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మేకల సునీత రాము యాదవ్‌,మురుగేష్‌ , రావుల అంజయ్య,మేకల రాము యాదవ్‌, జేఏసీ వెంకన్న, డోలి రమేష్‌, సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు