Sunday, September 8, 2024
spot_img

ప్రజాస్వామ్య విజయానికి ఓటర్లు మూల స్తంభం

తప్పక చదవండి
  • జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాదిరి ఎన్నికలు
  • ముఖ్యఅతిథిగా మొయినాబాద్ సబ్ ఇన్స్పెక్టర్ రామచంద్రయ్య

“ప్రజాస్వామ్య విజయానికి చైతన్యవంతమైనటువంటి బాధ్యత కలిగినటువంటి ఓటర్లు మూల స్తంభం” అని పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాములు పేర్కొన్నారు.. గురువారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తోల్కట్ట నందు మాదిరి ఎన్నికలను (మాక్ పోలింగ్) సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయురాలు వాణి సక్కుబాయి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ మాదిరి ఎన్నికలలో పాఠశాల విద్యార్థులు అందరూ పాల్గొని ఓటు హక్కును వినియోగించుకున్నారు. విద్యార్థుల అభ్యర్థులుగా ఓటర్లుగా ఎన్నికల సిబ్బంది గా విధులు నిర్వహించి బాధ్యతగా ఓటు వేసి ప్రజా ప్రతినిధులుగా నిలబడి ప్రజాస్వామ్యాన్ని ఎన్నికల ప్రక్రియను వారు అనుభవ పూర్వకంగా తెలుసుకున్నారు..

ఓటు విలువలను తెలుసుకొని ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ ప్రజాప్రతినిధుల ఎన్నిక ప్రక్రియను విద్యార్థులు తామే ఓటు వేయడం ద్వారా స్వీయ అనుభవాన్ని పొందారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన మాక్ పోలింగ్ ఓటింగ్ ప్రక్రియ ఒంటిగంటలోపు ముగిసింది.
రెండు గంటల నుండి మాక్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభించారు.. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన మొయినాబాద్ మండల సర్కిల్ ఇన్స్పెక్టర్ రామచంద్రసార్ గెలుపొందిన విద్యార్థులను అభినందించారు.. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ బాధ్యత కలిగిన పౌరుడు తప్పకుండా ఓటు హక్కును సద్వినియోగం అయ్యేలా వినియోగించుకోవాలని అలాగే ఓటు హక్కును దుర్వినియోగం చేసుకోకూడదని, మంచివారికి ఓటు వేసి ప్రజాస్వామ్య విజయానికి సమర్థులైన పాలకులను ఎన్నుకోవాలని పేర్కొన్నారు.. మాదిరి ఎన్నికల ప్రక్రియలో పాఠశాల యాజమాన్యం మరియు విద్యార్థులే ఎన్నికల సిబ్బందిగా, ఓటర్లుగా అభ్యర్థులుగా నిలబడి విజయవంతం చేశారు. తోల్కట్ట ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటరెడ్డి, పాఠశాల ఎస్ఎంసి వైస్ చైర్మన్ నరసింహులు విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు.. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బ్లేస్సి మేడం, మల్లారెడ్డి, రవీందర్ జి, సరిత, దుర్గామణి, పాఠశాల విద్యార్థులు పాల్గొని మాదిరి ఎన్నికలను ఘనవిజయం చేశారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు