Sunday, September 8, 2024
spot_img

విజయ్‌-వెంకట్‌ ప్రభు కాంబినేషన్ లో పొలిటికల్ రైడ్‌..

తప్పక చదవండి

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌ కాంపౌండ్ నుంచి సినిమా వస్తుందంటే అంచనాలు అమాంతం ఆకాశాన్నంటుతాయని ప్రత్యేకించి చెప్పనసవరం లేదు. ఈ స్టార్ హీరో ప్రస్తుతం లియో సినిమాతో బిజీగా ఉన్నాడు. దళపతి 67గా వస్తున్న ఈ చిత్రాన్ని లోకేశ్‌ కనగరాజ్‌ డైరెక్ట్ చేస్తున్నాడు. కాగా ఈ మూవీ సెట్స్‌పై ఉండగానే మరోవైపు దళపతి 68 వార్త కూడా నెట్టింట హల్‌ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే కస్టడీ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించిన తమిళ దర్శకుడు వెంకట్‌ ప్రభు డైరెక్షన్‌లో ఈ సినిమా ఉండబోతుంది.

ఈ సినిమా షూటింగ్ ఆగస్టు 2023లో షురూ కానుంది. 2024 తమిళ నూతన సంవత్సరాది సందర్భంగా విడుదల చేసేందకు ప్లాన్ చేస్తున్నారని ఓ వార్త ఇప్పటికే కోలీవుడ్ సర్కిల్‌లో చక్కర్లు కొడుతోంది. అయితే తాజాగా ఈ షెడ్యూల్‌ను మార్చినట్టు నటుడు అరుణ్ విజయ్‌ ట్వీట్ చేశాడు. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం అక్టోబర్ 2023లో దళపతి 68 చిత్రీకరణ మొదలు కానుండగా.. 2024 దీపావళి కానుకగా రాబోతుందని తెలియజేశాడు. వెంకట్‌ ప్రభు-విజయ్‌ కాంబోలో వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ పక్కా పొలిటికల్ జోనర్‌లో ఉండబోతుందని కూడా ప్రకటించేశాడు. ఇప్పుడీ అప్‌డేట్ విజయ్‌ అభిమానులను ఖుషీ చేస్తోంది.

- Advertisement -

పాన్ ఇండియా కథాంశంతో రానున్న దళపతి 68లో సీనియర్ హీరోయిన్ జ్యోతిక ఫీ మేల్ లీడ్‌ రోల్‌లో నటించనుందని వార్తలు వస్తుండగా.. దీనిపై వెంకట్‌ ప్రభు టీం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. విజయ్‌-జ్యోతిక 2000వ సంవత్సరంలో రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఖుషిలో నటించారు. మళ్లీ ఇన్నాళ్లకు ఈ ఇద్దరూ సిల్వర్‌ స్క్రీన్‌పై మెరువబోతుంది నిజమే అనే దానిపై రాబోయే రోజుల్లో క్లారిఈ రానుంది. ఈ మూవీలో ఎస్‌జే సూర్య విలన్‌గా కనిపించబోతున్నట్టు ఇన్‌సైడ్‌ టాక్‌. ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు