Sunday, September 8, 2024
spot_img

ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్..

తప్పక చదవండి

జనగామ : శుక్రవారం నాడు హైదరాబాద్ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం నుండి రాష్ట్ర ఎన్నికల అడిషనల్ సెక్రెటరీ లోకేష్ కుమార్,
ఉమ్మడి వరంగల్ జిల్లాల ఎన్నికల అధికారులతో ఎన్నికల సిబ్బందికి విధుల కేటాయింపు శిక్షణ తరగతులుఎలక్షన్స్ సంబంధిత అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు.. జిల్లా నుండి ఎన్నికల అధికారి కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య సహాయ ఎన్నికల అధికారి సుహాసిని సంబంధిత ఎన్నికల విభాగం సిబ్బందితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడిషనల్ సెక్రటరీ లోకేష్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ శాసనసభ ఎన్నికలు- 2023, కు సంబంధించి ఎన్నికల సిబ్బందికి విధులు కేటాయించి ప్రదేశాలు సూచించాలని ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ లకు మాస్టర్ ట్రేనర్స్ చే శిక్షణ తరగతులు నిర్వహించాలని ఎన్నికల విధులకు సంబంధించి సిబ్బందిని అదనంగా సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు..

ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య మాట్లాడుతూ ఎన్నికల విధులకు కేటాయించే సిబ్బంది వివరాలు నమోదు చేసి ఆర్డర్స్ జారీ చేసి శిక్షణ నిర్వహించుటకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.. ఎన్నికల సిబ్బందికి శిక్షణ నిమిత్తం (ఈవీఎం) ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ గోడౌన్ లో నుండి అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు కాంగ్రెస్ నుండి రవి బిజెపి నుండి విజయ్ కుమార్ సిపిఎం విజేందర్ బిఆర్ఎస్ రావేల రవిటిడిపి ఎస్ .శ్రీధర్ బిఎస్పీ జై.కుమార్ ల సమక్షంలో ఈవీఎంలు వివి ప్యాట్స్ తీయడం జరిగిందని తెలిపారు.. ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో జిల్లా సమాచార వైజ్ఞానిక అధికారి రాంప్రసాద్ ఎన్నికల నోడల్ ఆఫీసరర్స్ కే రాము సయ్యద్ ఇస్మాయిల్ ఈడీఎం దుర్గారావు ఎన్నికల విభాగం తాహసిల్దార్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు