Sunday, September 8, 2024
spot_img

శిథిలావస్థకు చేరిన ఉప్పరపల్లి అంగన్వాడీ..!

తప్పక చదవండి
  • భయం భయంతో అంగన్వాడీ విధులు..!
  • పసి పిల్లల ప్రాణాలతో చెలగాటం..!
  • సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారు..!
  • ప్రాణం పోతేనే గాని పట్టించుకోరా..!
  • ఈ కథనంపై అధికారులు స్పందిస్తారా లేదా వేచి చూడాల్సిందేనా..?

చెన్నారావుపేట : మండల పరిధిలోని ఉప్పరపల్లి గ్రామంలో ఎప్పుడో నిర్మించిన అంగన్వాడీ కేంద్రం భవనం పూర్తి శిథిలావస్థకు చేరింది. భవనం వినియో గానికి పనికి రాకున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.మరో భవనం నిర్మించక పోవడంతో అరకొర వసతులు ఉన్న చిన్నా రులకు పూర్వ ప్రాథమిక విద్యను అందిస్తున్నారు. పిల్లలకు, గర్బిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించడం,చిన్నారులకు ఆటపాటలతో చదువు చెప్పడానికి అంగన్వాడీ టీచర్లు అవస్థ పడుతున్నారు. అయినప్పటికీ ఒక్కపూట సంపూర్ణ భోజనం వండి పెట్టడానికి ఆయాలు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యనందిం చాల్సిన అంగన్వాడీ కేంద్రాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి.భవనాలు శిథిలావస్థకు చేరినా కనీస మరమ్మతులు చేపట్టే దిక్కులేదు.వర్షం కురిస్తే నీరు చేరి సామాగ్రితో సహా అన్ని తడిసి ముద్దాయి తున్నాయి. ఎప్పుడు గుణ పెంకలు ఊడి మీద పడుతుందో అనే భయం భయంలో విధులు నిర్వహిస్తున్నారు.చిన్నారులతో పాటు బాలింతలు, గర్భి ణులకు రోజూ పౌష్టికాహారం అందిం చడానికి కూడా కొన్నిచోట్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పైకప్పులు పెచ్చులూ పడుతుం డటంతో చిన్నారులకు ప్రమాదం పొంచిఉంది.భవనాల్లో ఇబ్బం దులు తప్పడం లేదు. విద్యుత్తు సదుపాయం,ఫ్యాన్లు లేక కొన్ని చోట్ల ఉక్కపోత సమస్య ఉంటోంది.తాగునీటి వసతి, మరుగుదొడ్లు కూడా లేవు.అంగన్వాడీ కేంద్రాల పరిస్థితి ఇది.సకల సదుపా యాలతో కూడిన శాశ్వత భవనాలను నిర్మించాలని లబ్ధిదారులు, చిన్నారుల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు