Sunday, September 8, 2024
spot_img
Array

పలువురి రిజిస్ట్రార్ ల బదిలీలు..

తప్పక చదవండి
  • ఉత్తర్వులు జారీ చేసిన రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్..
  • బదిలీలు, పోస్టింగ్ లపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న పలువురు..
  • ఇంతకు ముందు పోస్టింగులు, ప్రమోషన్లు వచ్చినా తిరస్కరించిన రిజిస్ట్రార్లు..
  • లక్షల రూపాయలు వెనుకేశారనే పలు ఆరోపణలు..
  • ఇప్పుడు ఆఘమేఘాల మీద బదిలీలు, పోస్టింగులు ఇవ్వడం వెనుక మర్మమేంటి..?

హైదరాబాద్ :
తెలంగాణ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్టుమెంటులో పలువురు రిజిస్ట్రార్లకు బదిలీలు, పోస్టింగులు కల్పించారు.. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి.. ఇంతకు ముందు ఎన్నోమార్లు బదిలీలకు, పోస్టింగ్లకు నో చెప్పిన పలువురు రిజిస్ట్రార్లు ఒకే చోట సంవత్సరాల తరబడి పాతుకుని పోయి.. లక్షల రూపాయలు వెనుకేశారన్న ఆరోపణలు వున్నాయి.. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం సడన్ గా బదిలీల ప్రక్రియ చేపట్టడం వెనుక మతలబు ఏమిటని పలువురు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.. వివరాలు చూద్దాం..

జీఓ ఆర్.టి. నెంబర్ : 277.. ప్రకారం దాదాపు 73 మంది సబ్ రిజిస్ట్రార్లకు బదిలీలు, వివిధ పోస్టింగులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి..
జీఓ ఆర్.టి. నెంబర్ : 275.. ప్రకారం 6 మంది డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాండ్ వారికి బదిలీలు, ప్రమోషన్లు, పోస్టింగులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి..
జీఓ ఆర్.టి. నెంబర్ : 276.. ప్రకారం దాదాపు 10 మంది జిల్లా రిజిస్టర్లకు పదోన్నతులు, బదిలీలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి..
ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రిన్సిపాల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్ ఆదేశాలు జారీ చేశారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు