Sunday, September 8, 2024
spot_img

ట్రాఫిక్‌ అస్తవ్యస్తం నియంత్రణ శూన్యం..!

తప్పక చదవండి

ట్రాఫిక్‌ జామ్‌తో అవస్థలు.. ప్రధాన కూడళ్లలో రహదారిని ఆక్రమించి వ్యాపారాలు ` ట్రాఫిక్‌ నియంత్రించని అధికారులు..

ఇబ్రహీంపట్నం : ఇబ్రాహీం పట్నం అంబేడ్కర్‌ కూడలో ఆదివారం ఉద యం ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కగింది. సాగర్‌ రహదారిపై వాహనదారులు ట్రాఫిక్‌ అంతరాయం తో తీవ్ర అవస్థలకు గురయ్యారు. ఇబ్రాహీంపట్నం నుంచి శేరిగుడ వరకు దాదాపు 3కీమీ మేర ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. పెళ్లిళ్లు సీజన్‌ అవ్వడంతో నగరం నుంచి సమీప గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు ప్రయాణిం చడంతో వాహనాలు సైతం ఎక్కడిక్కడ నిచిపోయి ప్రజ లు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొ న్నారు. దీంతో బాటసారులు తీవ్ర ఇక్కట్లకు గుర య్యారు.. ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించడానికి ట్రాఫిక్‌ పోలీసులు అష్టకష్టాలు పడ్సా వస్తుంది. ప్రతి రోజు వేలాది మంది వివిధ పనుల నిమిత్తం ఇబ్రహీంపట్నం వస్తుంటారు. అయితే పట్టణంలో ట్రాఫిక్‌ వ్యవస్థ అస్తవ్యస్తంగా మార డంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతు న్నారు. రోడ్లపైనే వాహనాల పార్కింగ్‌ చేయడం, వ్యాపార వస్తువులను పెడుతుండడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదరవుతున్నాయి. ప్రధాన కూడలి అంబే ద్కర్‌ చౌరస్తా, మంచాలకు వెళ్లే రోడ్డు, సాగర్‌ రహదారి బస్‌ స్టాప్‌ వద్ద సమస్య జఠింగా మారింది. రోడ్డును అక్రమించి వ్యాపారాలు చేస్తుండడం తో పాద చారులు కూడా నడవలేని పరిస్థితులు ఏర్పడు తున్నాయి. ఈ ప్రధాన కూడళ్లలో పోలీసు సిబ్బందిని నియమించి, ఎప్ప టికప్పుడు ట్రాఫిక్‌ రద్దీని నివారిస్తూ, రోడ్లపై వాహనాలు నిలుపకుండా చేస్తే బాగుంటుందని ప్రయాణికులు అంటున్నారు. ఆటోలు కూడా ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్‌ చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని ప్రజలు అంటున్నారు. వారంతపు సంత జరిగే ప్రతీ బుధవారం ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. దీన్ని అదుపు చేయాలని పోలీస్‌ అధికారులకు వాహనదారులు బాటసారులు కోరుతున్నారు.

- Advertisement -

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు