Sunday, September 8, 2024
spot_img

సీఎం ఇలాకలో బీఆర్‌ఎస్‌ శ్రేణులకు చేదు అనుభవం

తప్పక చదవండి
  • బీఆర్‌ఎస్‌ ప్రచారం అడ్డుకున్న గ్రామస్తులు

కొండపాక : సీఎం స్వంత నియోజక వర్గం కొండ పాక మండలం బందారం గ్రామంలో బీఆర్‌ఎస్‌ ప్రచారాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామం నుండి రింగ్‌ రోడ్డు వెళ్లుతున్న క్రమంలో నష్టం పరిహారం, ఇండ్లు కోల్పొతున్న తమకు న్యాయం చేయాలని ప్రచారంకు వచ్చిన అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, నాయకులను గ్రామ మహిళలు నిలదీశారు. దీంతో కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఒకానొక సందర్భంలో బీఆర్‌ ఎస్‌ నాయకులు గ్రామ మహిళలకు సద్ది చెప్పె ప్రయత్నం చేసినా మహిళలు శాంతించ పోవడంతో ప్రచారం అర్థంతరంగా ముగించుకొని వేరే గ్రామంలో ప్రచారానికి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా గ్రామ మహిళలు మాట్లాడుతూ..బందారం గ్రామం నుండి వెళ్లుతున్న రింగ్‌ రోడ్డు సంబంధించి భూములు, ఇండ్లను కోల్పొతున్న తమకు నష్ట పరిహారం అందించాలన్నారు. పిల్లలకు ఉద్యోగ కల్పనలో బీఆర్‌ఎస్‌ విఫలమైందని ఆరోపించారు. ఇదిలా ఉంటే ప్రచారానికి వచ్చిన నాయ కులు సమాధానం చెప్పకుండ దురుసుగా సమాధానం ఇవ్వడం పై మహిళలు అసహనం వ్యక్తం చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు