Sunday, September 8, 2024
spot_img

పటాన్ చెరు నియోజకవర్గంలో దూకుడు పెంచిన కాంగ్రెస్ పార్టీ.

తప్పక చదవండి
  • బీఆర్ఎస్, టీడీపీ నాయకులు కాంగ్రెస్ లో చేరిక.
  • స్థానిక ఎమ్మెల్యే కి ఇక నిద్ర పట్టదు: కాట శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్ : అధికార బీఆర్ఎస్ పార్టీకి అసమ్మతి నేతలు ఝలక్ ఇస్తున్నారు. రోజురోజుకు కాంగ్రెస్ లో చేరికల సంఖ్య పెరుగుతుంది పటాన్ చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. గుమ్మడిదల మండలం గుమ్మడిదల మరియు నల్లవల్లి గ్రామాలకు చెందిన బిఆర్ఎస్ మాజీ మండల్ ప్రెసిడెంట్ నరేందర్ రెడ్డి, టీడీపీ మండల్ ప్రెసిడెంట్ రాములు గౌడ్, టీడీపీ యువజన ప్రెసిడెంట్ శ్రవణ్ రెడ్డి, బీఆర్ఎస్ యువజన అధ్యక్షులు కె రవీందర్ రెడ్డి, టి రవీందర్ రెడ్డి, వార్డ్ మెంబెర్స్ రాము, యాదగిరి, మరియు ఎంఎన్ఆర్ యువసేన సభ్యులు వారి బృందం 500 మంది ఆ పార్టీని వీడి కాట శ్రీనివాస్ గౌడ్ సమీక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత వారి కుటుంబం మాత్రమే అన్ని రకాలుగా లబ్ది పొందిందని తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఏ ఒక్కరికి ఉద్యోగం రాలేదని అన్నారు. రాష్ట్ర ప్రజానికమంతా మీరు చెప్పే మాయమాటలు నమ్మి మరోసారి మోసపోరని మార్పు మొదలైంది రాబోయేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనని అన్నారు.మీ పాలనపై విరక్తి చెంది అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు.

తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ కార్డులతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చేసిన అభివృద్ధి శూన్యమని కమిషన్లు దండుకోవడం తప్ప మరొకటి చేయలేదని అన్నారు. ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీకి పతనం ఖాయమైందని అన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని అన్ని వర్గాల ప్రజలకు సమాన అభివృద్ధి లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి, సంగారెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్యామ్ రావు, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ రెడ్డి, మండల్ ప్రెసిడెంట్స్ నర్సింగ్ రావు, వడ్డె క్రిష్ణ, ఎంపీపీ రవీందర్, ఎంపీటీసీలు నాగేందర్ గౌడ్, గోవర్ధన్ గౌడ్, ప్రతాప్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్, ట్రెజరర్ మైపాల్ రెడ్డి, జనరల్ సెక్రటరీలు నరసింహ రెడ్డి, బాలక్రిష్ణ గౌడ్, శ్రీను, సర్పంచ్ నీలమ్మ, ఉప సర్పంచులు రాజు, బాసిరెడ్డి, సంగారెడ్డి జిల్లా INTUC ప్రెసిడెంట్ నరసింహ రెడ్డి, సంగారెడ్డి జిల్లా మైనారిటీ కన్వినర్ వాజీద్, మాజీ ప్రెసిడెంట్ వీరారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ దయాకర్ రెడ్డి, అసెంబ్లీ ఎస్ సి సెల్ ప్రెసిడెంట్ మహేష్, యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేష్, జయశంకర్ గౌడ్, కిష్టాగౌడ్, మహిపాల్ రెడ్డి, శంకర్, వాసుదేవ్ రెడ్డి, జైపాల్ రెడ్డి, అజార్, కాంగ్రెస్ పార్టీ నాయకలు, కార్యకర్తలు, కె ఎస్ జి యువసేన సభ్యులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు