Sunday, September 8, 2024
spot_img

భూ మాతనా.. భూ మేతనా.?

తప్పక చదవండి
  • కాంగ్రెస్‌ ధరణిని బంగాళాఖాతంలో వేస్తారంట
  • బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక పన్నులు రద్దు
  • 3650 కుటుంబాలకు పోడు భూముల పట్టాలు
  • తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చాం
  • వందశాతం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వస్తుంది..
  • భట్టి ఏం చేసిండని ఓట్లు అడుగున్నడు
  • కాంగ్రెస్‌ పాలనలో పడ్డ కష్టాలు మర్చిపోవద్దు
  • బీఆర్‌ఎస్‌ పాలనలో రైతులు ఎంతో బాగు
  • ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌

సూర్యాపేట : ఎన్నికలప్పుడు పార్టీల చరిత్ర ఆలోచన చేయాలని,న్యాయం వైపు ప్రజలు నిలబడాలని సీఎం కేసీఆర్‌ అన్నారు మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన ప్రజా ఆశీర్వాద సభకు హాజరై సీఎం కేసీఆర్‌ హాజరై ప్రసంగించారు.ఓటు మన తలరాతలు మారుస్తుందని ఓటు వేసేటప్పుడు రాయేదో రత్నం ఏదో చూసి ఓటు వేయాలని అన్నారు.కాంగ్రెస్‌ వల్లనే తెలంగాణ ఆగం అయ్యిందని 55 ఏళ్లుగా హరిగోసాలు పెట్టించిన కాంగ్రెస్‌ పార్టీ గెలిపిస్తారా.? కాలువలో నీళ్లు పారించిన బిఆర్‌ఎస్‌ పార్టీని గెలిపిస్తారా అని అన్నారు.పెన్‌ పహాడ్‌ మండలములో సంవత్సరంలో పది నెలలు నీళ్లు పారుతున్నయని కాళేశ్వరం జలాలు అద్భుతమైన ప్రగతి తీసుకొచ్చాయని సూర్యాపేట జిల్లాలో 2. 15 వేల ఎకరాలు పంట పండిస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుబంధు ఇస్తున్నామని, రైతుబంధు పుట్టించింది కేసీఆర్‌ అన్నారు.ఉత్తంకుమార్‌ రెడ్డి అంటుండు, కెసిఆర్‌ ప్రజలు కట్టిన పన్నులు తీసుకుపోయి రైతుబంధు ఇచ్చి దుబారా ఖర్చు చేస్తున్నారని, వాల్లకు బుద్ధి చెప్పాలి.జగదీష్‌ రెడ్డి గెలిస్తేనే రైతే బంధు వస్తుంది.పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ అంటున్నాడు మూడు గంటలు కరంట్‌ చాలు ,రైతులు 10 హెచ్‌.పి మోటార్‌ లను పెట్టుకోరి అని,మరి అతన్ని ఎం చేయాలి. బట్టి విక్రమార్క ధరణి తీసి బంగాలో బంగాళాఖాతంలో వేస్తాం, కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే భూమాత పేరుతో ఒక యాప్‌ తీసుకొస్తాం.. అది భూ మాతనా భూ మేతనా అంటూ సీఎం కేసీఆర్‌ ఎద్దేవా చేశారు.అన్నదాతలు హక్కులను కాలరాస్తున్నారు కాంగ్రెస్‌ వాళ్లు.కోమటిరెడ్డి సోదరులకు డబ్బు కావరం పట్టింది.ఆగడాలు ఎక్కువ అయ్యాయి.వాళ్ళు గెలిస్తే చాలా అరాచకాలు జరుగుతాయి అన్నారు.కాంగ్రెస్‌ వాళ్లు దద్దమ్మలు దశాబ్దాల తరబడి మూసి మురికి నీళ్లు తాపించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్‌ సమస్త లేకుండా చేసిన ఘనత బిఆర్‌ఎస్‌ పార్టీకే దక్కిందన్నారు. ఇవాళ పాలేరు నుంచి మంచినీళ్లు తెచ్చి ప్రతి ఇంటికి నీళ్లు అందిస్తున్నామన్నారు. దేశంలోనే తెలంగాణ తలసరి ఆదాయం నెంబర్‌ వన్‌ గా ఉందన్నారు. తెలంగాణ పసిడి సిరులు పండిస్తున్నారు. ఇప్పటికీ మూడు కోట్ల టన్నుల దాన్యం పండిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్‌ దద్దమ్మలు మనలను ఆగము చేశారు ప్రజలు ఆలోచన చేయాలి. జగదీష్‌ రెడ్డి 2001 నుండి పట్టు వదలకుండా తెలంగాణ పోరాటం చేసిండు గొప్ప ఉద్యమ కారుడు. నాకు తిక్క రేగి ఆమరణ నిరాహార దీక్ష చేస్తే తెలంగాణ వచ్చింది. కెసిఆర్‌ శవయాత్రనా.. తెలంగాణ జైత్ర యాత్ర నా అని తెగింపుతో తెలంగాణ కోసం కొట్లాడినా..అయిన తెలంగాణ ఇవ్వలే. ఆ తర్వాత ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేస్తే తెలంగాణ దక్కిందన్నారు.జిల్లాలో జగదీష్‌ రెడ్డి చేసిన అభివృద్ధి కాంగ్రెస్‌ వాళ్లు ఎవరైనా చేసారా.? 30 వేల కోట్లతో యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ నల్గొండ లో నిర్మాణం చేపిస్తున్నారు జగదీష్‌ రెడ్డి. బీజేపీ కి ఓటేస్తే మోర్ల వేసినట్లే అని ఎద్దేవ చేశారు.వ్యవసాయ మోటార్‌ లకు మీటర్లు పెడితే కేంద్రం 25 వెల కోట్లు ఇస్తామన్నారు అయినా వెనక్కి తగ్గలేదు,చచ్చినా మీటర్లు పెట్టను అని చెప్పిన.సూర్యపేట లో సద్దాల చెరువు, ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ ఇంటర్నేషనల్‌ స్థాయిలో నిర్మించామని, సూర్యపేట లో తన మార్కు చూపిస్తూ జగదీష్‌ రెడ్డి అద్భుతమైన అభివృద్ధి చేశారని పేర్కొన్నారు.జగదీష్‌ రెడ్డి మళ్ళీ గెలుస్తాడు.జగదీష్‌ రెడ్డి ఉన్నత స్థానం లో ఉంటాడు.జగదీష్‌ రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించాలి. 100 శాతం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వస్తుంది.గిరిజన బంధు కూడా అమలు చేస్తాం, ఆటో లకు ఫిట్నెస్‌ చార్జ్‌ లను రద్దు చేస్తాం అని ఆటో కార్మికులకు శుభవార్త చెప్పారు.

అంతకుముందు మంత్రి జగదీష్‌ రెడ్డి మాట్లాడుతూ..యోధుడు, సాహసి,
తెలంగాణ కోసం అలుపెరుగని పోరాటం చేసి, గమ్యాన్ని ముద్దాడిన నేత ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని,ఆయన కాలి గోటికి కూడా సరిపోని దొంగలు కేసీఆర్‌ పై అనుచిత వాక్యాలు చేస్తున్నారు.ఇవ్వాళ సభండా వర్గాలు సంతోషంగా జీవిస్తున్నాయి.కాళేశ్వరం జలాలతో సూర్యపేట కోనసీమ లాగా తయారైందన్నారు.సూర్యపేట లో డ్రై పోర్ట్‌ ,పారిశ్రామిక వాడ,ఐటి టవర్‌ రక్షణ ల నిర్మాణం, సూర్యపేట లో టూరిస్ట్‌ సర్కిల్‌ కూడా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్‌ ని కోరారు. సూర్యాపేట జిల్లాలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు ప్రజలు,కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.ఈ కార్యక్రమంలో ఎంపి బడుగుల లింగయ్య యాదవ్‌,ఎం.ఎల్‌.వి జిల్లా ఇంచార్జి తక్కెళ్లపల్లి రవీందర్‌ రావు.జడ్పీ చైర్మన్‌ గుజ్జ దీపికా, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న,మధుసూదన చారి,చెరుకు సుధాకర్‌,మున్సిపల్‌ చైర్మన్‌ పెరుమాళ్ళ అన్నపూర్ణ.మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్‌. శంకరమ్మ,వై.వి, నిమ్మల శ్రీనివాస్‌,ఒంటెద్దు నరసింహ రెడ్డి, నంద్యాల దయాకర్‌ రెడ్డి,ఎంపీపీ లు లు, జెడ్పీటిసి లు, జిల్లా నాయకులు,ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

వైరా నియోజకవర్గంలో..
వైరా ప్రాజెక్టు కింద నీళ్లు పారితే గతంలో పన్నులు వసూలు చేశారు.. కానీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక పన్నులు రద్దు చేశామని బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ గుర్తు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వైరా నియోజకవర్గంలో జరిగిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభ లో కేసీఆర్‌ పాల్గొని.. ప్రసంగించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ చేసిన అభివృద్ధి పనులను వైరా సభకు విచ్చేసిన ప్రజలకు వివరించారు. పోడు భూముల పంపిణీ కింద 3650 కుటుంబాలకు 7140 ఎకరాలకు పట్టాలు ఇచ్చామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఈ పోడు భూములు ఇవ్వడంతో పాటు వారికి రైతుబంధు అమలు చేశామన్నారు. అలాగే పోడు భూములకు సంబంధించి పోలీసు కేసులను ఎత్తివేశామని వివరించారు. మరోవైపు 3,659 తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చామని.. వీటిలో వైరాలో 45 తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చామన్నారు. రైతులకు 3 గంటల విద్యుత్‌ చాలని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారని మండిపడ్డారు. మూడు గంటల విద్యుత్‌ ఇస్తే పొలానికి సరిపడా నీళ్లు ఎలా పారుతాయని సభకు వచ్చిన ప్రజలను సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు. దేశానికి అన్నం పెట్టే స్థితికి తెలంగాణ చేరుతుందని ఆనందం వ్యక్తం చేశారు. మిషన్‌ భగీరథ కింద నీళ్లు ఇస్తేనే ఓటు వేయాలని ప్రజలకు చెప్పామని.. ఐదేళ్లలో మిషన్‌ భగీరథ పూర్తి చేస్తామని చెప్పి నిరూపించామన్నారు. సీతారామ ప్రాజెకు ్ట(పూర్తయితే పంటలకు ఢోకా ఉండదని పేర్కొన్నారు. ప్రాజెక్టు ద్వారా మరో 30 వేల ఎకరాలకు నీళ్లు పారిస్తామని.. అప్పుడు ఖమ్మం జిల్లా వజ్రపు తునకలా మారుతుందని తెలిపారు. నోట్ల కట్టల ఆసాములకు కోట్ల విలువ చేసే ఓటుతోనే బుద్ధి చెప్పాలని సీఎం కేసీఆర్‌ కోరారు.

మధిర నియోజకవర్గంలో కేసీఆర్‌
మధిరలో దళిత జనాభా ఎక్కువ. దళిత సమాజం, మేధావులు దళిత బిడ్డలు, అక్కాచెల్లెళ్లు ఈ విషయాన్ని దృష్టి పెట్టి ఆలోచన చేయాలి. 50 ఏండ్ల కాంగ్రెస్‌ పరిపాలనలో దళిత బంధు లాంటి ప్రోగ్రాం పెట్టి ఉంటే ఇంతకాలం దళితుల దరిద్రం ఇట్లనే ఉండేదా? దళిత సమాజం దోపిడికి గురైన సమాజం. తరతరాలుగా అణచివేయబడ్డ సమాజం. వెలివాడలలో నివసించిన సమాజం. వాళ్లు సాటి మనషులు కారా..? వాళ్లు పైకి రాకూడదా..? వాళ్లు మనలాగా తయారు కాకూడదా..? ఎంతకాలం దళితుల దరిద్రం ఉంటదో.. ఈ దేశం ముఖం మీద ఒక మచ్చనే ఉంటది తప్ప ఈ దేశానికి క్షేమం కాదు. అది పోవాలి అని కేసీఆర్‌ పేర్కొన్నారు. ఉత్తర భారతదేశంలో దళితుల మీద భయంకరమైన దాడులు. మోదీ రాష్ట్రంలో కూడా దాడులు. భయంకరమైన దాడులు మనం అసలు భరించలేం. అతి తీవ్రమైన వివక్ష. ఇది పోవాలి. తెలంగాణ దళిత బంధు భారతదేశ దళితజాతికి ఒక మార్గదర్శనం చేయాలని పెట్టుకున్నాం. ఒకటే రోజు అందరికీ ఇవ్వలేకపోయినా, కనీసం దఫదఫాలుగా అయినా సరే వారి పేదరికం పోవాలి. దళిత యువకులు, యువతుల్లో వజ్రాలు, రత్నాలు ఉన్నాయి. వాళ్లకు అవకాశం లేక ఉంటున్నారు. ఉట్టిగ పదిలక్షలు ఇచ్చి ఊరుకోవడం లేదు. దళితబంధులో మేం జేసింది ఏందంటే రిజర్వేషన్లు పెట్టినం. వైన్‌, బార్‌ షాపులు బాగా డబ్బులు సమకూర్చే వ్యాపారం. ఒక్క దళితుడికి అన్న ఉండేన ఈ రాష్ట్రంలో. రిజర్వేషన్లు పెట్టి 260 మందికి ఇచ్చాం. మెడికల్‌ షాపుల్లు, ఫర్టిలైజర్‌ షాపుల్లో రిజర్వేషన్లు పెట్టినం. ఎవ్వళ్లు ఇవన్నీ నాకు చెప్పలేదు. ఇవన్నీ నాకంతట నాకు పెట్టుకున్న ప్రోగ్రాం. చింతకాని మండలం ఇవాళ బాగుపడ్దది. మరి దళితబిడ్డలు మళ్లా కాంగ్రెస్‌కు ఎందుకు గుద్దాలి ఓటు. ఈ పట్టి లేని భట్టి విక్రమార్కకు ఓటేస్తే మీకు వచ్చేది ఏంది..? పట్టులేనటువంటి, పట్టించుకోనటువంటి భట్టి విక్రమార్క మనకు చేసేది ఏంది..? ఆయన నియోజకవర్గానికే ఆరు నెలలకు ఒకసారి వస్తడు. చుట్టపు చూపులా వచ్చే మనిషి. అంతే కదా..? నేను వాస్తవం చెబుతున్నా అని కేసీఆర్‌ పేర్కొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు