Sunday, September 8, 2024
spot_img

ఓవైసీ చేతిలో కారు స్టీరింగ్..!

తప్పక చదవండి
  • కేసిఆర్ తో బిజేపి కలిసి ప్రయాణం చేయదు..
  • తెలంగాణ ఎన్నికల్లో తండ్రీ, కొడుకుల ప్రభుత్వం కూలిపోతుంది..
  • భద్రాద్రి రామయ్య భక్తుల మనోభావాలనూ ముఖ్యమంత్రి కించపరుస్తుండు..
  • ఖమ్మం బిజేపి సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా.
  • కేసీఆర్‌ పాలనలో వ్యవసాయం నిర్వీర్యమైంది : కిషన్ రెడ్డి..
  • సిఎం కేసీఆర్ దొంగ దీక్షను బయటపెట్టిన జిల్లా ఖమ్మం : బండి సంజయ్..
  • సబ్సిలన్ని ఎత్తేశాడు : ఎమ్మెల్యే ఈటల రాజేందర్…

ఖమ్మం : మజ్లిస్ పార్టీతో వేదికను కూడా పంచుకోని మేము, రాష్ట్రం లో ఓవైసీతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న కేసిఆర్ తో సర్కారు ను పంచుకొంటామా అంటూ ప్రశ్నించారు హోమంత్రి అమిత్ షా… రైతు గోస – బిజేపి భరోసా పేరుతో ఖమ్మం పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.. తాను ఖమ్మంలో అడుగుపెట్టే నాటికి తెలంగాణ విమోచనకు 75యేళ్ళు నిండాయన్నారు. అందుకు స్వరాష్ట్రం కోసంమై పోరాడిన జమలాపురం కేశవరావును గుర్తు చేసుకున్నారు.. అంతకు ముందు తిరుపతి వెంకన్న, స్థంభాద్రి లక్ష్మీనరసింహ స్వామి వార్ల ఆశీర్వాదంతోనే ఇక్కడకు వచ్చానన్నారు అమిత్ షా… మజ్లిస్ అధినేత ఓవైసీ మద్దతుతో కొనసాగుతున్న కేసిఆర్ ప్రభుత్వాన్ని కూల్చివేయాలని పిలుపు ఇచ్చారు.. ఎందరో యువకులు, విధ్యార్ధుల త్యాగాల పునాధులపై ఏర్పడ్డ తెలంగాణ రాష్య్రం కల్వకుంట్ల కుటుంబ కబంధ హస్తాలలో చిక్కుకపోయిందన్నారు… భద్రాద్రి రాముని చెంతకు వెళ్తున్న కారు, రాముడి దర్శనానికి మాత్రం ఎందుకు పోవట్లేదని ప్రశ్నించారు.. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం రామచంద్రుని భక్తుల మనోభావాలను కేసిఆర్ కించపరుస్తున్నాడని దుయ్యబట్టారు.. ఓవైసీ చేతిలోని కారు స్టీరింగ్ రాముడి చెంతకు పోనీయట్లేదని ఎద్దేవా చేశారు… ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ నాటి నుండి వస్తున్న శ్రీ రామ నవమి ఆనవాయితీని కేసిఆర్ ఎందుకు పక్కకు పెట్టారని విమర్శించారు. దౌర్జన్యాలు, అక్రమ కేసులను పెట్టించి భాజాపా కార్యకర్తలు వెనక్కి తగ్గుతారని అనుకోవటం కేసిఆర్ అవివేకం అన్నారు.. నిరుద్యోగుల కోసం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పోరాడుతుంటే అరెస్ట్ లు చేయించారని, శాసనసభ నుండి ఈటెల రాజేందర్ ను బయటకు పంపించి గొంతు నొక్కారని ఆయన ఉద్ఘాటించారు.. మళ్ళీ కేసిఆర్ లేదా ఆయన కొడుకు ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్నారని, కాని కానివ్వమన్నారు… రానున్న ఎన్నికలలో 4జి, 3జి, 2జి లు కలిసి ప్రభుత్వంలో భాగం పంచుకోలనుకుంటున్నాయన్నారు… పేదలకు ఇళ్ళు, రైతులకు రుణమాఫీ, దళితబంధు, యువతకు ఉద్యోగాలెక్కడని కేసిఆర్ సర్కారును దుయ్యబట్టారు… కాంగ్రెస్ సర్కారు తన 10యేళ్ళ ఏలుబడిలో 22 వేల కోట్లు రైతులకు ఖర్చు చేస్తే, గత రెండు విడతల భాజాపా ప్రభుత్వంలో 125 వేల కోట్లు అందించిదన్నారు… అలాగే 7 లక్షల కోట్ల రుణాలను రైతులకు కాంగ్రెస్ అందిస్తే, బిజేపి తన 10 ఏళ్ళలో 20 లక్షల కోట్ల రుణాలను రైతులకు ఇచ్చేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు… 265 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తే, మా సర్కారు 365 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ స్థాయికి చేరుకుందని చెప్పారు… కేసిఆర్ సర్కారు ధాన్యం కోనుగోలునూ రాజకీయం చేస్తుందని విమర్శించారు..ఎప్పటికీ కేసిఆర్, ఓవైసీలతో బిజేపి కలిసి ప్రయాణించదని తేల్చి చెప్పారు… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కేవలం కాంగ్రెస్ పార్టీ 2లక్షల కోట్లిస్తే, ఒక్క తెలంగాణాకే భాజాపా సర్కారు రూ. 280 లక్షల కోట్లిచ్చినట్లు ప్రకటించారు.. ఇంకా తెలంగాణాలో 33లక్షల కుటుంబాలకు శౌచాలయాలను, 1.90కోట్ల కుటుంబాలకు 5 కేజీల బియ్యాన్ని, 12 లక్షల కుటుంబాలకు ఉజ్వల్ గ్యాస్ సిలిండర్ లు పంపెణీ చేశామని షా తెలిపారు.. 2.50 లక్షల మందికి ఇళ్ళను పంపిణీ చేశామన్నరు… దళిత, మహిళా, బిసి, రైతు, యువత వ్యతిరేకి కేసిఆర్ అని స్పష్టం చేశారు.. అందుకే రానున్న తెలంగాణ ఎన్నికలలో బిఆరెస్, మజ్లిస్ ద్వయాన్ని మట్టి కరిపించి నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజేపి సర్కారు ముఖ్యమంత్రిని గెలిపించమని కోరారు.

కేసీఆర్ పాలనలో వ్యవసాయం నిర్వీర్యమైంది : కిషన్ రెడ్డి..
సీఎం కేసీఆర్‌పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ పాలనలో వ్యవసాయం నిర్వీర్యమైంది. కేసీఆర్‌ ప్రభుత్వం వ్యవసాయ సబ్సిడీలు ఇవ్వడం లేదు. వరి వేయొద్దని కేసీఆర్‌ ప్రభుత్వమే చెబుతోంది. వ్యవసాయ రుణాలు పావలా వడ్డీకి ఇవ్వట్లేదు. తెలంగాణలో 75 శాతం కౌలు రైతులే ఉన్నారు. కౌలు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తూతూ మంత్రంగా రుణమాఫీలు చేస్తున్నారు. రైతులకు కేసీఆర్‌ సర్కార్‌ వెన్నుపోటు పొడిచింది. కేసీఆర్‌ ప్రభుత్వం పంటబీమా పథకాన్ని అమలు చేయట్లేదు. కోటి ఎకరాలకు సాగునీరు ఇస్తామన్న కేసీఆర్‌ హామీ ఏమైంది?. రైతులకు భరోసా ఇవ్వాలని బీజేపీ నిర్ణయించింది.

- Advertisement -

సిఎం కేసీఆర్ దొంగ దీక్షను బయటపెట్టిన జిల్లా ఖమ్మం : బండి సంజయ్.
అవినీతిపరుల గుండెల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చిచ్చర పిడుగు అని బిజెపి ఎంపి బండి సంజయ్ కుమార్ తెలిపారు.రైతు గోస-బిజెపి భరోసా పేరిట జరిగిన బహిరంగ సభలో ఎంపి బండి సంజయ్ ప్రసంగించారు. సిఎం కెసిఆర్ దొంగ దీక్షను బయటపెట్టిన జిల్లా ఖమ్మం జిల్లా అని, కేసీఆర్ మళ్లీ మోసం చేసేందుకు ప్రజల ముందుకు వస్తున్నారని, కేసీఆర్ కు ఎన్నికలు వస్తేనే హామీలు గుర్తుకు వస్తాయని బండి ఎద్దేవా చేశారు. కేసీఆర్, కాంగ్రెస్ నేతల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే తెలంగాణ బాగుపడుతుందన్నారు..

సబ్సిలన్ని ఎత్తేశాడు: ఈటల రాజేందర్.
బీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్‌పై ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మండిపడ్డారు. రైతులకు దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు ఇస్తామని చెప్పిన కేసీఆర్ అన్ని బంద్ చేశారన్నారు. టాక్టర్లపై సబ్సిడీ ఎత్తివేశారని, డ్రిప్ ఇరిగేషన్ లేదని, రైతులు పంట అమ్ముకోవాలంటే వారం పాటు పడిగాపులు కాయాల్సిన పడాల్సిన పరిస్థితి నెలకొందని ఈటల రాజేందర్ విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తే రైతులు పండించిన ప్రతి గింజను కొంటామన్నారు. రైతులకు ఇవ్వాల్సిన అన్ని సబ్సిడీలు ఇస్తామన్నారు. తెలంగాణలో పేదలకు ఇప్పటికీ సొంత ఇంటి కల నెరవేరలేదని చెపపారు. బీజేపీ అధికారంలోకి వస్తే పేదలందరికి స్థలాలు ఇవ్వడంతో పాటు ఇళ్లు కట్టిస్తామని ఈటల రాజేందర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, తరుణ్ చుగ్, రఘునందన్ రావు , డీకే అరుణ, లక్ష్మణ్, శృతి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇంద్రసేనారెడ్డి, ప్రేమేందర్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు