Sunday, September 8, 2024
spot_img

తలసేమియాపై పోరాటంలో భాగంగా హైదరాబాద్‌లో 2వ జాతీయ సదస్సు…

తప్పక చదవండి
  • తలసేమియా, సికిల్ సెల్ సొసైటీ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహాణ…
  • సదస్సులో భాగస్వామ్యమవుతున్న జాతీయ, అంతర్జాతీయ స్థాయి
    నిపుణులు, వక్తలు, పరిశోధకులు..

హైదరాబాద్ : నగరంలోని తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ హైదరాబాద్ ఆధ్వర్యం‍లో తలసేమియాపై పోరాటంలో భాగంగా నిర్వహించనున్న ‘కాన్ఫరెన్స్ టు కంబాట్ తలసేమియా’ 2వ జాతీయ సదస్సు ప్రకటించింది. ఈ సదస్సును శనివారం (ఈ నెల 7వ తేదీ) శివరాంపల్లిలోని తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ హైదరాబాద్ ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్నామని వారు తెలిపారు. నిపుణులు, రోగులు, సంరక్షకులు, వైద్య నిపుణుల ఆధ్వర్యంలో తలసేమియా పైన ‘అవగాహన, భాగస్వామ్యం, సంరక్షణ, నివారణ వైపు ప్రయాణం’ అనే అంశాలతో ఈ సదస్సు జరగనుంది.

జన్యు సంబంధిత వ్యాధిగా ప్రబలిన తలసేమియాను ఎదుర్కోవడానికి అవగాహన పెంచడంలో భాగంగా ఈ సదస్సు కీలక పాత్ర పోషించనుంది. ఈ జాతీయ సదస్సులో పాల్గొనే వారు, తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ ప్రతినిధులు ‘‘గర్భం దాల్చిన మొదటి త్రైమాసికంలో ప్రతీ ఒక్కరికి హెచ్‌బీఏ 2 పరీక్షను తప్పనిసరి చేయాలని’’ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పరీక్షలో భాగంగా తలసేమియా వ్యాధికి సంబంధించిన సమాచారాన్ని ముందస్తుగా గుర్తించవచ్చని, ఈ విధానం తలసేమియా నివారణకు తోడ్పడుతుందని వారు నినదిస్తున్నారు. ఈ సదస్సులో గ్రీస్‌లోని సైప్రస్ మెడికల్ స్కూల్ విశ్వవిద్యాలయానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ డిమిట్రియోస్ ఫార్మాకిస్, ఇటలీలోని క్యూర్2చిల్డ్రెన్ ఫౌండేషన్‌కు చెందిన బిఎమ్‌టి స్పెషలిస్ట్ డాక్టర్ లారెన్స్ ఫాల్క్‌నర్‌లు ముఖ్యఅతిథులుగా పాల్గొని తలసేమియాకు సంబంధించిన పలు ప్రధానమైన అంశాల పైన చర్చించనున్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ హైదరాబాద్ ప్రెసిడెంట్ డాక్టర్ చంద్రకాంత్ అగర్వాల్ మాట్లాడుతూ., “ఈ సదస్సు తలసేమియాను ఎదుర్కోవడానికి మా సమిష్టి నిబద్ధతకు, విజయవంతమైన ప్రాతినిధ్యానికి వేదికగా నిలుస్తుంది. విశిష్ఠ అతిథులతో జరగనున్న ఈ చర్చ నిస్సందేహంగా భాధితులకు మెరుగైన చికిత్సను అందించడంలో దోహదపడుతుంది. తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ ఎల్లప్పుడూ రాష్ట్రాన్ని, దేశాన్ని తలసేమియా రహితంగా మార్చడానికి తీవ్రంగా కృషి చేస్తుందని అన్నారు. తలసేమియా, సికిల్ సెల్ సొసైటీ సీఈఓ- సెక్రటరీ డాక్టర్ సుమన్ జైన్ తన ఆలోచనలను పంచుకుంటూ., “ఈ సదస్సును ప్రకటించినందుకు ఎంతో సంతోషిస్తున్నాము. ఈ ప్రయత్నం నిపుణులను మరియు తలసేమియా రోగులను ఒక ఉమ్మడి వేదికపైకి తీసుకువచ్చే ఒక అపూర్వ అవకాశం. ఈ భాగస్వామ్యంతో భవిష్యత్తులో తలసేమియా తీవ్రతను ఎప్పటికప్పుడు పరిగణిస్తూ, దానిని శాశ్వతంగా నివారించే దిశలో కృషి చేయనున్నామని పేర్కొన్నారు. ఈ సదస్సుతో పాటు అక్టోబరు 7న (శనివారం) శిల్పకళా వేదికలో సాయంత్రం 6.30 గంటల నుంచి నిర్వహించనున్న టీఎస్‌సీఎస్‌ 25 ఏళ్ల ఉత్సవాల్లో భాగంగా తలసేమియా బాధిత చిన్నారులతో కలిసి అబ్బురపరిచే నృత్య ప్రదర్శనతో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా ఈ వేడుకల సందర్భంగా టి.ఎస్.సి.ఎస్. హైదరాబాద్ ఆధ్వర్యంలో ‘బ్లడ్ బైండ్స్’ పేరుతో నూతన బయోగ్రఫీనీ కూడా ఆవిష్కరించనున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు