Sunday, September 8, 2024
spot_img

సీఎం కేసీఆర్ ఆస్తులు ఎంతో తెలుసా..?

తప్పక చదవండి

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గురువారం నామినేషన్ వేశారు. గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంతోపాటు కామారెడ్డి నుంచి కూడా ఈసారి కేసీఆర్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం ఈ రెండు స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్బంగా కేసీఆర్ సమర్పించిన అఫిడవిట్‌లో ఆస్తులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

ఆస్తుల వివరాలు..
మొత్తం ఆస్తులు : రూ. 58.17 కోట్లు
చరాస్తులు : రూ. 35.42 కోట్లు (నగదు, డిపాజిట్లు, టీ-న్యూస్‌లో పెట్టుబడులు)
కేసీఆర్ పేరిట అప్పు : రూ. 17.12 కోట్లు
కుటుంబం అప్పు : రూ. 7.23 కోట్లు
ఏడాదికి ఆదాయం: రూ. 1.60 కోట్లు
సాగు భూమి : 53.30 ఎకరాలు
వ్యవసాయేతర భూమి : .36 ఎకరాలు
శోభ పేరిట చరాస్తులు : రూ. 7.78 కోట్లు
ఉమ్మడి చరాస్తులు : రూ. 9.81 కోట్లు.
ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, జేసీబీల్లాంటి 14 వాహనాలు (విలువ కోటీ 16 లక్షలు)
కేసులు: ఉద్యమం సమయంలో 9 కేసులు
కార్లు, వ్యవసాయ భూములు లేవు

- Advertisement -

2018 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు అఫిడవిట్‌లో మొత్తం చరాస్తుల విలువ 10.40 కోట్లు.. స్థిరాస్తులు 12.20 కోట్లుగా చూపించగా.. ఇప్పుడు వాటి విలువ రెట్టింపు అయినట్లు తెలిపారు. అయితే, కేసీఆర్ పేరిట వాహనాలేమీ లేవు. మొత్తం రూ. 17,40,000 విలువ చేసే 3 కిలోల బంగారం, వజ్రాలు, రత్నాలు ఆయన వద్ద ఉన్నాయి. శోభ పేరిట 2,841 గ్రాముల (2 కేజీల 800 గ్రాముల) బరువైన బంగారు ఆభరణాలున్నాయి. 45 కేజీల వెండి వస్తువులున్నాయి. వీటన్నిటి మొత్తం విలువ రూ. 1,49,16,408గా పేర్కొన్నారు. మొత్తంగా కేసీఆర్ పేరిట చరాస్తులు రూ. 17,83,87,492 ఉండగా, ఆయన భార్య శోభ పేరిట రూ. 7,78,24,488 ఉన్నాయి. ఇక, కేసీఆర్ హిందూ అవిభాజ్య కుటుంబానికి రూ. 9,81,19,820 మేర చరాస్తులున్నాయి. స్థిరాస్తుల విషయానికొస్తే కేసీఆర్ పేరిట రూ. 8.5 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉండగా ఆయన భార్య పేరిట ఏమీ లేవు. కేసీఆర్ దంపతులకు స్థిర, చరాస్తులన్నిటి మొత్తం విలువ రూ. 58,93,31,800. మొత్తం అప్పులు రూ. 24,51,13,631 ఉన్నాయని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు