Sunday, September 8, 2024
spot_img

టార్గెట్‌ ఎంపీ ఎలక్షన్స్‌

తప్పక చదవండి

అన్ని స్థానాల్లో గెలిచేలా వ్యూహరచన

  • ఆరు గ్యారెంటీలు పక్కా అమలు
  • ఇందుకోసం గ్రామ కమిటీల ఏర్పాటు
  • లోక్‌సభ ఎన్నికల్లో వ్యూహంపై విస్తృతంగా చర్చ
  • పీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో పలు నిర్ణయాలు
  • రేవంత్‌రెడ్డి నేతృత్వంలో గాంధీభవన్‌లో భేటీ
  • హాజరైన పార్టీ నూతన ఇంచర్జ్‌ దీపాదాస్‌ మున్షీ
  • నేడు ఢల్లీికి వెళ్ళనున్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి
  • లోక్‌సభ ఎన్నికలపై కీలక సమావేశం
  • దిశానిర్దేశం చేయనున్న ఏఐసీసీ

హైదరాబాద్‌ : తెలంగాణ కాంగ్రెస్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆరు గ్యారెంటీల అమలు కోసం గ్రామ కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జ్‌గా దీపాదాస్‌ మున్షీ నియామకం అయిన తర్వాత తొలిసారి గాంధీభవన్‌లో రాష్ట్ర కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఈ భేటీలో లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహలతో పాటు పలు అంశాలపై చర్చించారు. అనంతరం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతి జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం కోసం ఎకరం స్థలం కేటాయించాలని నిర్ణయించారు. అలాగే స్టేట్‌ ఎస్సీ కమిషన్‌ను రద్దుచేసి, దాని స్థానంలో కొత్త కమిషన్‌ను తీసుకురావాలని నిర్ణయించారు. అలాగే జోనల్‌ వ్యవస్థను సవిూక్షించేందుకు కమిటీ వేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచి అధికారం చేపట్టిన తర్వాత తొలిసారి పీసీసీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ విూటింగ్‌లో ఏఐసీసీ కార్యదర్శులు, మంత్రులు, ఎన్నికల, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యలతో పాటు కాంగ్రెస్‌ జిల్లాల అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, పార్టీ అధికార ప్రతినిధలు పాల్గొన్నారు. పార్లమెంట్‌ ఎన్నికలు ముగిసిన తర్వాత నామినేటెడ్‌ పోస్టులను భర్తీ చేయాలని రేవంత్‌ నిర్ణయించారు. ఆరు గ్యారెంటీల అమలు కోసం గ్రామ కమిటీలు ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింతగా చేరువ చేయవచ్చని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హావిూలను తూచా తప్పకుండా అమలు చేస్తామన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో కష్టపడి పనిచేసినవారికి పదవులు వస్తాయని, పార్టీ గుర్తింపు ఇస్తుందని రేవంత్‌ చెప్పారు. ఇదిలావుంటే సీఎం రేవంత్‌ రెడ్డి ఢల్లీి పర్యటనకు వెళ్తున్నారు. గురువారం ఢల్లీిలో ఏఐసీసీ భేటీ కానుంది. లోక్‌సభ ఎన్నికలపై ఈ విూటింగ్‌లో చర్చించనున్నారు. ఈ భేటీలో లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు కోసం అనుసరించా ల్సిన వ్యూహలపై రాష్ట్ర నాయకత్వానికి కాంగ్రెస్‌ హైకమాండ్‌ దిశానిర్దేశం చేయనుంది. అందులో భాగంగా వివిధ రాష్టాల్ర సీఎంలు, పీసీసీ చీఫ్‌లతో అధిష్టానం సమావేశం కానుంది. ఈ భేటీలో పాల్గొనేందుకు రేవంత్‌ ఢల్లీి వెళ్తున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు వైఎస్‌ షర్మిల సైతం హస్తినకు వెళుతున్నారు. రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లిఖార్జున ఖర్గేతో భేటీ కానున్నారు. గురువారం వైఎస్సార్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయనున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో రేవంత్‌ ఢల్లీికి వెళుతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. రేవంత్‌ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మూడుసార్లు ఢల్లీికి వెళ్లారు. గత ఢల్లీి పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. రేవంత్‌తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా మోదీని కలిశారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో మర్యాదపూర్వకంగా మోదీని కలిశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్టాన్రికి రావాల్సిన నిధులు, విభజన హావిూలపై మోదీతో చర్చించారు. ఆ పర్యటన తర్వాత ఇప్పుడు మళ్లీ హస్తినకు రేవంత్‌ వెళుతున్నారు. షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్న క్రమంలో రేవంత్‌ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు