Sunday, September 8, 2024
spot_img

ఎన్నికల విధులపట్ల నిర్లక్ష్యం వహించిన కానిస్టేబుల్‌ సస్పెన్షన్‌

తప్పక చదవండి

కరీంనగర్‌ : కరీంనగర్‌ పోలీస్‌ హెడ్‌ క్వార్టర్‌, ఏఆర్‌ విభాగంలో పనిచేస్తున్న ఏఆర్‌ కానిస్టేబుల్‌ నెంబర్‌. 3059, వి.రాజు ఎన్నికల విధి నిర్వహణ కొరకు చెక్‌ పోస్ట్‌ వద్ద నియమింపబడ్డాడు, అధికారుల ఉత్తర్వులు పాటించ కుండా, విధులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినందున, విచారణ జరిపి బుధవారం రోజు సస్పెండ్‌ చేసినట్లు కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌, కరీంనగర్‌ ఎల్‌.సుబ్బరాయుడు తెలిపారు. ఈ మేరకు సస్పెన్షన్‌ ఉత్తర్వులు జారీచేశారు. కరీంనగర్‌ కమీషనరేట్లోని వివిధ విభాగాలలో పనిచేస్తున్న అన్ని స్థాయిల అధికారులందరు క్రమశిక్షణతో చట్టానికి ఎన్నికల నియామవళికి లోబడి పనిచేయాలని, విధులపట్ల నిర్లక్ష్యం వహించినవారిపై శాఖపరమైన చర్యలతో పాటుగా ఎన్నికల నియమావళి అనుసారం కూడా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు