Sunday, September 8, 2024
spot_img

జనగామ జిల్లాలో విద్యా వ్యవస్థ రక్షణ కోసం విద్యార్థి జేఏసీ మరో పోరాటం..

తప్పక చదవండి

జనగామ జిల్లా కోసం పోరాడిన విద్యార్థులకు జనగామ జిల్లాలో భవిష్యత్తు లేకుండా చేశారని జనగామ జిల్లా విద్యార్థి జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది.. మంగళవారం రోజు జనగామ జిల్లా కేంద్రంలోని జేఏసీ కార్యాలయంలో టీజీవీపీ, ఎస్.ఎఫ్.ఐ., వీ.ఎస్.ఎఫ్., టి.వీ.యూ.వీ., ఆర్.వీ.ఎస్., టి.బీ,వీ.ఎస్., బీ.సి.ఎస్.ఎఫ్., ఎస్.వీ.ఎస్., విద్యార్థి సంఘాలు సమావేశమై జనగామ జిల్లాలో విద్యా వ్యవస్థ ప్రస్తుత స్థితిగతులపై చర్చించాయి. ఈ సంద్భంగా వందేమాతరం స్టూడెంట్ ఫెడరేషన్ అధ్యక్షుడు మంగళంపల్లి రాజు మాట్లాడుతూ జనగామ జిల్లాలో విద్యా వ్యవస్థను కావాలని నాశనం చేశారని, జిల్లా కేంద్రంలో బీసీ, ఎస్సి, ఎస్టీ, మైనారిటీ స్టడీ సర్కిల్లు ఏర్పాటు చేయాలని ఎన్నో సం. లుగా పోరాడుతున్నా ఇక్కడి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీజీవీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్టల సురేష్ మాట్లాడుతూ.. జిల్లా కోసం పోరాడిన విద్యార్థుల మీద కేసులు పెట్టి సిగ్గులేకుండా అధికారం అనుభవిస్తున్న వారు, కనీసం జనగామ జిల్లాలో ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన ప్రభుత్వ పాలిటెక్నిక్, నర్సింగ్ కాలేజీలు తేలేకపోయారని విమర్శించారు.. వీజేఎస్ జిల్లా అధ్యక్షుడు బండి రాకేష్ గౌడ్ మాట్లాడుతూ.. జనగామ జిల్లాలో విద్యార్థులకు చదవడానికి కాలేజీలు లేవని ఆరోపించారు.. టి.జీ.వీ.పీ. జిల్లా అధ్యక్షుడు గన్ను కార్తీక్ మాట్లాడుతూ.. జనగామ జిల్లాకి యునివర్సటీ పీజీ కాలేజ్, ఐటిఐ కాలేజీలకు స్థలం కేటాయించిన కూడా నిర్మాణం చేయకపోవడం ఏంటని ప్రశ్నించారు.. ఎస్.ఎఫ్.ఐ. జిల్లా అధ్యక్షుడు సందీప్ మాట్లాడుతూ జనగామ జిల్లాలో కార్పోరేట్ విద్యా వ్యవస్థను పెంచడానికి ప్రభుత్వం కుట్ర చేస్తుందని తెలిపారు.. బీసీఎసెఫ్ జిల్లా అధ్యక్షుడు ఆసర్ల సుభాష్ మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జనగామ జిల్లాలో ఎటువంటి నూతన వద్యా సంస్థలను ఏర్పాటు చేయకపోవడం ఇక్కడి నాయకుల అసమర్ధతకు అద్దం పడుతుందని తెలిపారు. టీబీవీఎస్ జిల్లా అధ్యక్షుడు తాల్లపల్లి శివరాం గౌడ్ మాట్లాడుతూ.. జనగామ జిల్లాకి కేంద్రీయ విశ్వవిద్యాలయం కావాలని ఏ నాయకుడు ప్రయత్నం చేయలేదని తెలిపారు.. కొలిపాక శివరాజ్ మాట్లాడుతూ జనగామ జిల్లాలో కాలేజీలు మూతబడుతున్నా కూడా వాటిని పరిరక్షించాలని ఆలోచన ఎవరూ చేయడం లేదని తెలిపారు.. టీజీవీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తుంగ కౌశిక్ మాట్లాడుతూ జనగామ ఎమ్మెల్యే ఒక్కరోజు కూడా విద్యావ్యవస్థ అభివృద్ధి కోసం సమీక్ష కూడా నిర్వహించలేదని ఆరోపించారు. సేవా లాల్ విద్యార్థి సేన జిల్లా నాయకుడు అనిల్ చౌహాన్ మాట్లాడుతూ విద్యా వ్యవస్థను కాపాడడానికి విద్యార్థి సంఘాలు ఐక్య పోరాటం చేస్తామని తెలిపారు.. టి.యూ.వీ.యూ. జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ జనగామ జిల్లాలో 2 ఇంజనీరింగ్ కళాశాలలు, 3 బీ ఫార్మసీ, ఇంటర్ కాలేజీలు, బీఈడీ కాలేజీలు ఇలా ఎన్నో కాలేజీలు మూతపడుతున్నా నాయకులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు వెంపటి అజయ్, రమేష్, శ్రీను, అనిల్ తదితరులు పాల్గొన్నారు…

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు