Sunday, September 8, 2024
spot_img

యాదాద్రి నరసింహ స్వామి సన్నిధిలో డాక్టర్ వకుళాభరణం..

తప్పక చదవండి

రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం యాదాద్రిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ యాదాద్రి లక్ష్మి నరసింహని సన్నిధిలో మధురానుభూతి ఇచ్చిందని అన్నారు. తమ ఇలవేల్పు అయిన స్వామివారిని దర్శించుకుని వారి పరమ పవిత్రమైన సన్నిధిలో గడిపే అవకాశం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను అని ఆయన పేర్కొన్నారు. బుధవారం నాడు ఉదయం 10 గంటలకు కలియుగ ప్రత్యక్ష దైవం, తెలంగాణ ప్రజల కొంగు బంగారం, ఇలవేల్పు అయిన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి దర్శించుకున్నారు. సన్నిధిలో కొంతసేపు గడిపారు.. ఇందులో భాగంగా ఆయన వెంట జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి, దివ్య డైమండ్స్ అధినేత మహేంద్ర బాబు, అయాన్, అనిల్ చింత, వివిధ సంఘాల ప్రతినిధులు పులిపాటి శ్రీనివాస్, భోజరాజ్ తదితరులు వున్నారు. కృష్ణశిలతో యాదాద్రిని పునర్నిర్మానం చేసిన సీఎం కేసీఆర్ చరిత్రలో సువర్ణ అధ్యాయాన్ని లిఖించుకున్నారు అని అన్నారు. ఆధునిక భారతదేశ చరిత్రలో ప్రభుత్వమే ఇంతటి మహాకార్యం తలపెట్టడం ఎక్కడ జరగలేదు అని అన్నారు. గత నెల రెండవ తేదీ నుండి 25 తేదీ వరకు, డాక్టర్ వకుళాభరణం అమెరికా పర్యటించి వచ్చిన విషయం తెలిసిందే. అక్కడ జరిగిన తానా మహాసభలలో ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఈ ఏడాదికి గాను తానా డాక్టర్ వకుళాభరణానికి మహాత్మ జ్యోతిరావు పూలే పురస్కారం అందజేశారు. కొద్దిరోజుల క్రితం స్వరాష్ట్రం చేరుకున్న డాక్టర్ వకుళాభరణం స్వామివారిని దర్శించుకోవడానికి బుధవారం నాడు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో యాదాద్రి చేరుకున్నారు.
ఆయన రాక సందర్భంగా జిల్లా పరిపాలన అధికారులు ఆర్డిఓ అమరేందర్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి యాదయ్య, రెవెన్యూ అధికారులు ప్రత్యేకంగా ఏర్పాట్లను చేశారు. దర్శనం సందర్భంగా ఆలయ సూపర్డెంట్ రాజన్ బాబు ఆధ్వర్యంలో అర్చక స్వాములు, వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం ఇచ్చారు. ఈ సందర్భంగా చైర్మన్ దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు