Sunday, September 8, 2024
spot_img

స్టార్‌ క్యాంపెనర్‌ విజయశాంతికి ఘనంగా స్వాగతం పలికిన ప్రజానీకం

తప్పక చదవండి
  • అరూరి రమేష్‌ అక్రమాలపై చార్జ్‌ షీట్‌ని విడుదల చేసిన స్టార్‌ క్యాంపెనర్‌ విజయశాంతి..
  • మహిళలను నిండా ముంచిన సర్కారుగా బీఆర్‌ఎస్‌ చరిత్రలో నిలిచిపోతుంది..
  • కేసీఆర్‌ ఒక్కడితోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదు..
  • పావలా వడ్డీ రుణాలు లేవు- పట్టించుకునే నాయకులే కరువు..
  • సోనియా ఆకాంక్షను పట్టించుకోలేదు.. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు..
  • వర్ధన్నపేట కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కె.ఆర్‌ నాగరాజు
  • ప్రజాదీవెన యాత్రలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న విజయశాంతి

పర్వతగిరి : సీఎం కెసిఆర్‌ ఒక్కడి పోరాటంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదని, వందలాది మంది యువకుల బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని స్టార్‌ క్యాంపెనర్‌ విజయశాంతి (రాములక్క) చెప్పారు. గురువారం వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని హనుమకొండ మండల 2వ డివిజన్‌ గుండ్లసింగారం కాలనీ లో వర్ధన్నపేట కాంగ్రెస్‌ అభ్యర్థి కె.ఆర్‌ నాగరాజు ఎన్నికల ప్రజా దీవెన యాత్రకు ముఖ్యఅతిథిగా స్టార్‌ క్యాంపెనర్‌ విజయశాంతి (రాములక్క) రావటంతో ప్రజానీకం ఘనంగా స్వాగతం పలికారు. సింగారం గ్రామ ప్రజలను ఉద్దేశించి విజయశాంతి మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎవరిని కదిలించినా అక్కడ సీఎం కెసిఆర్‌, ఇక్కడ ఎమ్మెల్యే అరూరి రమేష్‌ అక్రమాల గురించే చెబుతున్నారని అన్నారు. అసైన్డ్‌ భూములు, చెరువు శిఖం భూములు, ప్రభుత్వ భూములను కబ్జా చేసిన దగాకోరుగా ప్రజల గుండెల్లో కెసీఆర్‌, అరూరి రమేష్‌ చెరగని స్థానమే సంపాదించుకున్నారని విమర్శించారు. కెసీఆర్‌, అరూరి రమేష్‌ అధర్మ పాలనతో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్న మాట అక్షర సత్యం కాదా అని అడిగారు. ప్రజలకు అందుబాటులో లేని ఎమ్మెల్యే ఎందుకని ప్రశ్నించారు. ఎన్నో ఆశలతో సోనియమ్మ ఇచ్చిన తెలంగాణను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. నియంత సర్కారును గద్దె దింపితేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందన్నారు. భవిష్యత్తు కోసం సరైన నిర్ణయం తీసుకోకపోతే మరో ఐదేళ్లు బాధపడాల్సి వస్తుందని, ఈ ఎన్నికలు తెలంగాణ ప్రజల విజ్ఞతకు సంబంధించినవని చెప్పుకొచ్చారు. అక్రమాలు, అన్యాయాలు, దిగజారుడు రాజకీయాలతో బీఆర్‌ఎస్‌ పతనం ఖరారైందని వ్యాఖ్యానించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, సరైన సమయంలో తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు నమిండ్ల శ్రీనివాస్‌, పేరుమాండ్ల రామకృష్ణ, బక్క జడ్సన్‌, హానుమకొండ జిల్లా కిసాన్‌ సెల్‌ అధ్యక్షుడు పిల్లి వెంకటనరసింహ రెడ్డి, కుందూరు వెంకటరెడ్డి, హనుమకొండ మండల అధ్యక్షుడు అజయ్‌, బ్లాక్‌ అద్యక్షుడు తగెళ్లపల్లి తిరుపతి, మాజీ ఎంపిటిసి అనీల్‌ కుమార్‌ రెడ్డి, కార్పొరేటర్‌, శ్రీమాన్‌, దేవరకొండ అనీల్‌, 1డివిజన్‌ అధ్యక్షుడు నరేష్‌, మాజీ కార్పొరేటర్‌ బానోత్‌ కల్పన- సింగ్‌ లాల్‌, డివిజన్‌ అధ్యక్షుడు, గ్రామ అధ్యక్షుడు, మండల స్థాయి, గ్రామస్థాయి నాయకులు, మహిళా నాయకులు, యూత్‌ నాయకులు, మాజీ జెడ్పిటిసిలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, ఎస్సీ సెల్‌ నాయకులు, ఎస్టీ సెల్‌ నాయకులు, బీసీ సెల్‌ నాయకులు, మైనార్టీ సెల్‌ నాయకులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు, అభిమానులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు