Sunday, September 8, 2024
spot_img

పతులకు తోడుగా సతుల ప్రచారం

తప్పక చదవండి
  • ఆల వెంకటేశ్వర్ రెడ్డి సతీమణి ఆల మంజుల,
  • కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గౌనీ మధుసూదన్ రెడ్డి
  • భార్య కవిత ల ఇంటింటి ప్రచారం

చింతకుంట : దేవరకద్ర నియోజకవర్గం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిట్టింగ్ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సతీమణి ఆల మంజుల… కాంగ్రెస్ నుంచి ఇటీవల పోటీ చేస్తున్న గౌనీ మధుసూదన్ రెడ్డి భార్య కవిత బుధవారం రోజు ఇరు వర్గాల నుంచి తమదైన శైలిలో ప్రచార పర్వం మొదలుపెట్టారు. ఆల మంజుల నియోజకవర్గంలో తమ భర్త ఆలయ వెంకటేశ్వర్ రెడ్డి ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని గుర్తు చేస్తున్నారు.. ఈ అభివృద్ధి పనులను చూసి తమకు ఓటు వేయాలని! ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. అదే తరహాలో కాంగ్రెస్ నుంచి గౌని మధుసూదన్ కవిత రెడ్డి తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ అని కాంగ్రెస్ ద్వారానే అభివృద్ధి జరుగుతుందని! తమ పార్టీ మ్యానిఫెస్టో 6 గ్యారంటీలను గడపగడప తిరుగుతూ.. ప్రచారం మొదలు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా.. గడపగడపకు బొట్టు పెట్టి ముమ్మరంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. దేవరకద్ర నియోజకవర్గ మూసాపేట్ మండలం జానంపేట లో మహాలక్ష్మి గృహ జ్యోతి ,యువ వికాసం, యువ చేయూత వంటి పథకాలను విస్తృత స్థాయిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి జిఎంఆర్ గౌని కవిత రెడ్డి ప్రచారం చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ తరఫునుంచి దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ మండలం కరివేన గ్రామంలో ఇటు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సతీమణి ఆల మంజుల రెడ్డి గ్రామ గ్రామం తిరుగుతూ ప్రతి కుటుంబాన్ని దర్శించి కేసీఆర్ మ్యానుఫెస్టోను ప్రజలకు వివరించారు. కారు గుర్తుకే ఓటు వేసి అత్యధికమైన మెజారిటీతో తమ భర్తను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

వృద్ధులకు, వికలాంగులకు, ఆప్యాయంగా పలకరిస్తూ ఈవీఎంలలోని మొదటి గుర్తు అయిన కారు గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఈ ప్రచార పర్వములో కాంగ్రెస్ నుంచి భారీ మొత్తంలో ఓటర్లను తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. అదేతరాలో బీఆర్ఎస్లోకి కాంగ్రెస్ వాళ్లను కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వలసల పర్వం కొనసాగుతుందని నియోజకవర్గ గ్రామాలలో ప్రధాన రహదారుల్లో చర్చించుకుంటున్నారు. ఈ ప్రచార పరువం లో భాగంగా ఆల మంజుల రెడ్డి రైతులు పండించినటువంటి తమ పంటలకు గిట్టుబాటు ధర తమ ప్రభుత్వం ఇస్తుందని, ప్రతి చెరువులో కొంప చెట్లకు బదులు జలకలతో చెరువులు నీటితో కళకళలాడుతున్నాయని అభివర్ణించారు. వృద్ధులకు పెన్షన్లు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, డబల్ బెడ్ రూములు, కేసీఆర్ కిట్టు రైతు బీమా, రైతుబంధు అనేక సంక్షేమ పథకాలు ప్రభుత్వం నుండి తమ భర్త అందించారని ఇందుకుగాను తాము పనిచేసి నియోజకవర్గ అభివృద్ధి కోరిన వ్యక్తిగా తమకు భర్తకు ఓటు వేయాలని కోరారు. ప్రతి నియోజకవర్గం వెళ్లిన ప్రజలు తమ ప్రభుత్వ నాయకులను స్వాగతం పలుకుతున్నారని ఆమె వివరించారు. పనిచేసే ప్రభుత్వానికే ఓటు వేయాలని మరొకసారి ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని తమన ఆశీర్వదించాలని ప్రజలను కోరుతున్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ తరఫునుంచి మాజీ జెడ్పీ చైర్ పర్సన్ సీతా దయాకర్ రెడ్డి తమకు పూర్తి మద్దతు తెలుపుతూ మధుసూదన్ రెడ్డి తరపున ప్రజలను కాంగ్రెస్ వైపు తిప్పుతున్నారని తమ గెలుపు లక్ష్యంగా పనిచేస్తున్నది కవిత పేర్కొన్నారు. ప్రస్తుత జడ్పీ చైర్ పర్సన్ బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి స్వర్ణ సుధాకర్ రెడ్డి తమ తరఫునుంచి ప్రచారం నిర్వహిస్తున్నారని ఆల మంజుల రెడ్డి తెలుపుతున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రదీప్ గౌడ్ మాజీ జెడ్పిటిసి కాంగ్రెస్ వెంకటేశ్వర్ రెడ్డి వజ్రబాబు మైనార్టీ సెల్ అధ్యక్షులు జాకీర్ జాంగిర్ కమ్మరి శీను ఆన్సర్ బాల్రాజ్ ఈ రకంగా నియోజకవర్గంలో ప్రచారపర్వం కొనసాగుతుంది ఇందులో ఎవరి ఓటమి ఎవరి విజయమో వేచి చూడాల్సిందేనని ప్రజా ప్రతినిధులు ప్రజలు కోరుకుంటున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు