Sunday, September 8, 2024
spot_img

ఎమ్మెల్యే టికెట్ రేసులోకి సర్పంచ్ నవ్య!

తప్పక చదవండి
  • సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యకు టికెట్ నిరాకరించిన సీఎం కేసీఆర్
  • మాజీ మంత్రి కడియం శ్రీహారికి టికెట్ ప్రకటించిన బీఆర్ఎస్ బాస్
  • నేడు ఆమె పార్టీ పెద్దలను కలిసే అవకాశం
  • బీఆర్ఎస్ అధిష్టానికి జానకీపురం సర్పంచ్ నవ్య రిక్వెస్ట్
    స్టేషన్ ఘనపూర్‌లో రాజకీయాలు మరోసారి వార్తల్లోకి వచ్చాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను కాదని సీఎం కేసీఆర్ మాజీ మంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి టికెట్ ప్రకటించారు. అయినా తాను పార్టీ మారనన్న రాజయ్య టికెట్ కోసం ప్రయత్నిస్తానని చెప్పారు. ఆయనకు మద్దతుగా మంద కృష్ణ మాదిగ తదితరులు సంఘీభావం ప్రకటించారు. మరోవైపు ఒకే ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటున్నారు జానకీపురం సర్పంచ్ నవ్య. స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తా.. నాకు ఓ అవకాశం ఇవ్వండి అని ఆమె బీఆర్ఎస్ అధిష్టానాన్ని కోరుతున్నారు. ఒక మహిళ ఎమ్మెల్యే అయితే.. మహిళలు ఏమాత్రం ఇబ్బంది లేకుండా తమ సమస్యలు చెప్పుకోవడానికి వీలవుతుందని ఆమె తెలిపారు. మాదిగ బిడ్డనైన తనకు స్టేషన్ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇస్తారనే ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. ఏడు దశాబ్దాల చరిత్రలో స్టేషన్ ఘనపూర్ నుంచి ఒక్కసారి కూడా మహిళకు అవకాశం రాలేదని, ఈ సారి తనకు అవకాశం ఇవ్వాలని నవ్య అంటున్నారు. కేసీఆర్ తనకు ఒక్క ఛాన్స్ ఇస్తే నియోజకవర్గం రూపురేఖలు మార్చేస్తానని ఆమె ధీమాగా చెప్పారు. నియోజకవర్గ చరిత్రలో ఒక్కసారి కూడా మహిళ ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేదని.. తనకు అవకాశం ఇవ్వాలని నవ్య కోరుతున్నారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు