Sunday, September 8, 2024
spot_img

రాగాలు పలికే రాళ్లు..

తప్పక చదవండి
  • జనగామ, సిద్ధిపేట జిల్లాల సరిహద్దులో అద్భుతం..
  • సరిగమలు పాలిస్తున్న డోలరైట్ శిలలు..
  • బాహ్య ప్రపంచానికి తెలియకుండా చేస్తున్న మైనింగ్ మాఫియా..
  • రాతికొండ రహస్యాన్ని చేధించడానికి పరిశోధనలు చేస్తున్న
    జనగామకు చెందిన చరిత్రకారుడు రత్నాకర్ రెడ్డి..

హైదరాబాద్ : చూపుకు శిలలే.. ప్రాణంలేని రాళ్లే.. కానీ ఈ శిలలన్నీ ఓ విచిత్రం.. ఓ అద్భుతం.. ఏ శిలను రాపిడి చేసినా రాగాలు హోయలొలుకుతాయి. ఈ బండరాయిని తాకిన ప్రతీ ఒక్కరూ సంగీత కళాకారుడిలా మురిసి పోవాల్సిందే. ఇప్పటివరకు ఎవరూ గుర్తించని ఈ మిరాకిల్ రాక్స్ ప్రత్యేకతను కనులారా చూసి చెవులారా వింటేనే ఆ అద్బుతం గురించి అర్థమవుతుంది. వీటిని సింగింగ్ రాక్స్, మ్యూజికల్ రాక్స్ అంటుంటారు.. మైనింగ్ మాఫియా వలలో చిక్కుకున్న ఈ రాగాల కొండను బాధ్యతగా బాహ్య ప్రపంచానికి తెలిపి, కాపాడే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఏర్పడింది..

జనగామ & సిద్దిపేట జిల్లాల సరిహద్దులో సుమారు 90 కిలో మీటర్ల నిడివితో డోలరైట్ శిలలు ఉన్నాయి.. ముఖ్యంగా బచ్చన్నపేట మండలంలో ఎక్కువ శాతం ఈ గుట్ట ఎవరో పేర్చినట్లు కనిపిస్తాయి.. కట్కూరు, వీ.ఎస్.ఆర్ నగర్ సమీపంలో ఎక్కువగా ఈ శిలలు కనిపిస్తాయి.. వీటిని తాకితే స్పందిస్తాయి.. ఒక్కో రాయి ఒక్కో రాగం పలుకుతుంది.. ఒక్కోచోట ఒక్కో రకమైన ధ్వని తరంగాలు మనసు పులకరింప చేస్తాయి. ఈ రాళ్లను రాపిడిచేస్తే చక్కటి వినసొంపైన ధ్వని తరంగాలు సవ్వడి చేస్తాయి.. ఓ రాయి గుళ్లో గంట కొట్టినట్లు టంగ్.. టంగ్ మని ప్రతిధ్వనిస్తే మరో రాయి ఇనుప రాడ్డుతో గంట కొట్టినట్లు ధ్వనిస్తుంది..

- Advertisement -

వడగండ్ల వాన పడ్డ సమయంలో ఈ రాగాల కొండ పరిసరాలన్నీ వింతైన ధ్వని తరంగాలతో అబ్బుర పరుస్తాయి. ఆ ఫీలింగ్ మాటల్లో చెపితే అర్థంకాదు ప్రత్యక్షంగా అనుభవించాల్సిందే.. ఈ మ్యూజికల్ రాక్స్ ను స్థానికులు ఓ మహత్యంగా భావిస్తున్నారు. మనసు బాగలేకపోతే ఇక్కడికి వచ్చి బండరాళ్లు రాపిడిచేస్తే ఈ రాళ్లు పలికేరాగాలు రోగాలను కూడా నయం చేస్తాయని స్థానికులు చెబుతున్నారు.. ఈ వింతైన రాగాల కొండ రహస్యాన్ని బాహ్య ప్రపంచానికి తెలియకుండా చేసిన మైనింగ్ వ్యాపారులు గుట్టు చప్పుడు కాకుండా గుట్టను మాయం చేస్తున్నారు.. ఈ అద్భుతాన్ని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.. జనగామ జిల్లా కేంద్రానికి చెందిన రత్నాకర్ రెడ్డి అనే చరిత్ర పరిశోధకుడు ఈ రాతి కొండ రహస్యాన్ని ఛేదించిందేందుకు పరిశోధనలు చేస్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు