Sunday, September 8, 2024
spot_img

రైతుబంధుపై రేవంత్ రెడ్డిది దుర్మార్గమైన కుట్ర

తప్పక చదవండి
  • బిఆర్ఎస్ సీనియర్ నేత డా. దాసోజు శ్రవణ్

చిల్లర రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ లక్షలాది రైతుల జీవితాలతో చెలగాటమాడడం అన్యాయమ‌ని కాంగ్రెస్ నేత దాసోజు శ్ర‌వ‌ణ్ అన్నారు. రైతుల నోట్లో మన్నుకొడుతూ రైతుబంధుని నిలిపివేసే దుర్మార్గమైన కుట్ర చేసిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్. రేటంత రెడ్డిగా వున్న రేవంత్.. ఈ రోజు రైతుల పాలిట రాబందు రెడ్డిగా మారిండు ఆయ‌న మండిప‌డ్డారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు, రైతురుణమాఫీ పధకాలకు దాదాపు లక్ష కోట్ల రూపాయిలు ఖర్చు చేశారు కేసీఆర్. గిట్టుబాటు ధరలు, పుష్కలంగా సాగునీరు, 24 గంటల ఉచిత కరెంట్, రైతు వేదికలు ఇలా అద్భుతమై రీతిలో రైతులకు కేసీఆర్ అండగా వుంటే… ఇది చూసి ఓర్వలేని రేవంత్ కాంగ్రెస్, బిజేపీతో కుమ్మకై ఎన్నికల కమీషన్ పై ఒత్తిడి తెచ్చి దుర్మార్గంగా వ్యవహరించింది. లేఖ రాసిన రేవంత్ రెడ్డి సిగ్గు శరం లేకుండా ఇది తన లేఖ కాదని దాటవేత ధోరణిని ప్రదర్శిస్తుండు. మూడో తారీకు తర్వాత కేసీఆర్ గారు మూడో సారి ముఖ్యమంత్రి ఆయన తర్వాత రైతుబంధు పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుంది. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. కుటిల రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ కు తెలంగాణ ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టడం ఖాయం అని” దాసోజు అన్నారు. రైతుబంధుపై కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పెద్ద కుట్ర చేస్తోంది. తన రక్తాన్ని చెమటగా మార్చి అన్నం పెట్టె రైతన్నకు భరోసా కేసీఆర్ రైతుబంధు లాంటి పధకం అమలు చేస్తుంటే.. మరోపక్క రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్, బిజేపీతోకుమ్మక్కై రైతు నోట్లో మన్నుకొడుతూ రైతుబంధుని నిలిపివేసే దుర్మార్గమైన కుట్ర చేస్తోంది. దయచేసిన తెలంగాణ ప్రజలు కాంగ్రెస్, బిజెపీ కుట్రలకు తగిన గుణపాఠం చెప్పాలి. ఈ మేరకు నిర్వహించిన మీడియా సమావేశంలో దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడాలేని విధంగా రైతుభీమా, రైతుబంధు, రైతురుణమాఫీ పధకాలకు దాదాపు లక్ష కోట్ల రూపాయిలు ఖర్చు చేశారు కేసీఆర్. గిట్టుబాటు ధరలు, పుష్కలంగా సాగునీరు, 24 గంటల ఉచిత కరెంట్, రైతు వేదికలు ఇలా అద్భుతమై రీతిలో రైతులకు కేసీఆర్ అండగా వుంటే… ఇది చూసి ఓర్వలేని రేవంత్ కాంగ్రెస్, బిజేపీతో కుమ్మకై ఎన్నికల కమీషన్ పై ఒత్తిడి తెచ్చి దుర్మార్గంగా వ్యవహరించింది. రైతుబందు వస్తే రేవంత్ ఎందుకు కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారు ? రైతులు చల్లాగా వుంటే రేవంత్ రెడ్డికి ఎందుకు కడుపుమంట ? రేవంత్ రెడ్డి ఎందుకు రైతు బంధుని ఆపే కుట్ర చేస్తున్నాడు ? అని ” అని కోరారు బిఆర్ఎస్ సినీయర్ నేత డా దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు