Sunday, September 8, 2024
spot_img

ఆదాబ్ హైదరాబాద్ కథనానికి స్పందన..

తప్పక చదవండి
  • ఎస్.ఆర్.ఎస్.పి కెనాల్ ఫార్మా కంపెనీ వద్ద విచారణ చేపట్టిన అధికారులు.
  • కబ్జాకురైన ప్రాంతాన్ని కాకుండా ఖాళీ స్థలంలో సెట్టింగ్ (ప్రహరి) గోడ తొలగింపు.
  • వార్త రాసిన విలేకరిపై దుష్ప్రచారం చేస్తున్న కంపెనీ నిర్వాహకులు..
  • కబ్జా గురైన ప్రాంతంలో నిర్మాణం తొలగించాలని ఆదేశించిన తహసిల్దార్ రంగారావు.

సూర్యాపేట : ఎస్సారెస్పీ కెనాల్ భూమిని కబ్జా చేసిన “రావుస్ లాబొరేటరీస్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్” కంపెనీ పై మంగళవారం “ఆదాబ్ హైదరాబాద్” దినపత్రికలో కథనం ప్రచురితమైంది. ఈ కథనంపై స్పందించిన అధికారులు, గురువారం చివ్వెంల తహసిల్దార్ రంగారావు ఎస్సారెస్పీ కెనాల్ ఆక్రమణకు గురైన ప్రాంతాన్ని ఆర్.ఐ రామారావుతో కలిసి పరిశీలించారు. సంపద వనాలలో భాగంగా ఇరిగేషన్ అధికారులు చూయించిన ప్రాంతంలో మొక్కలు నాటేందుకు పెట్టిన హద్దులను, ఫార్మా కంపెనీ నిర్వాహకులు ఆక్రమించిన స్థలాన్ని గుర్తించారు.సూర్యాపేట ఖమ్మం రహదారి చివ్వెంల శివారులో ఉన్న రావుస్ ఫార్మా లేబొరేటరీస్ కంపెనీ నిర్వాహకులు, ఎస్సారెస్పి కెనాల్ కి సంబంధించిన భూమి లో అక్రమ ఫార్మా కంపెనీ నిర్మాణం చేపట్టడం పట్ల ఆగ్రహ వ్యక్తం చేశారు. ఇరిగేషన్ శాఖ వారు,ఫార్మా కంపెనీ వారికి అందించిన నోటీసును వివరాలను అడిగి తెలుసుకున్నారు.


ఆక్రమణకు గురైన ప్రాంతం వదిలి.. కాళీ స్థలంలో (సెట్టింగ్) గోడ తొలగింపు..
ఆదాబ్ హైదరాబాద్ పత్రికలో కథనం వచ్చిన తర్వాత అధికారుల నుండి ఫార్మా కంపెనీ నిర్వాహకులకు నోటీసులు అందడంతో చేసేదేమీ లేక, ఆక్రమణకు గురైన ప్రాంతాన్ని కాకుండా ఖాళీ స్థలం ఉన్న ప్రాంతంలో, సెట్టింగ్ బిళ్ళలతో ఏర్పాటు చేసిన దిమ్మెలను కొందిమేర తొలగించి,విచారణ కు వచ్చిన అధికారులకు చూయిస్తూ, ఇంతవరకే ఆక్రమణకు గురైందని నమ్మించే ప్రయత్నం చేశారు. గురైన ప్రాంతం ఇంతవరకే కాబట్టి వీటిని తొలగిస్తున్నామని డ్రామా ప్లే చేస్తున్నారు. వాస్తవానికి ఎస్సారెస్పీ కెనాల్ భూమి, ప్రస్తుతం మొక్కలు నాటేందుకు ఫెన్సింగ్ తిప్పిన హద్దు చూసినట్లయితే, ప్రస్తుతం కంపెనీ లోపల ఉన్న బ్రయిలర్లు ఉన్న ప్రాంతం నుంచి ఆక్రమణకు గురైనట్లు అధికారులు గుర్తించారు. కానీ కంపెనీ నిర్వాహకులు మాత్రం డమ్మీ గోడ చూపిస్తూ, ఇదే మేము మలుపుకున్న ప్రాంతం అని చెప్తూ, చేతులు దులుపుకుంటున్న పరిస్థితి అక్కడ ఉంది.అధికారులు ఆక్రమణకు గురైన ప్రాంతాన్ని రికవరీ చేసి సంపద వనంలో భాగంగా మొక్కలు నాటుతారా.? లేదా కంపెనీ నిర్వాహకులు చూయించిన ఖాళీ స్థలం వరకే అనే మాటలు నమ్మి, తప్పుడు నివేదిక ఇచ్చి చేతులు దులుపుకుంటారా వేచి చూడాల్సిందే.
అనంతరం తహసిల్దార్ రంగారావు మాట్లాడుతూ..రావుస్ ఫార్మ కంపెనీ వారు ఆక్రమించిన ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో పరిశీలించడం జరిగిందన్నారు. ఇప్పటికే ఇరిగేషన్ శాఖ నుంచి కంపెనీ నిర్వాహకులకు నోటీస్ కూడా అందించారని, ఆక్రమణకు గురైన ప్రాంతాన్ని తొలగించి, అధికారులకు అప్పగించాలని ఆ నోటీస్ లో పేర్కొన్నట్లు తెలిపారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే విచారణ చేపట్టినట్లు రంగారావు తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు