Sunday, September 8, 2024
spot_img

ఆగస్టు 6న జయశంకర్ స్మారకోపన్యాస స్పూర్తి సదస్సు..

తప్పక చదవండి
  • జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్న తెలంగాణ విద్యావంతుల వేదిక
    జిల్లా అధ్యక్షులు పందుల సైదులు..

నిర్విరామంగా తన జీవిత ప్రయాణాన్ని స్వరాష్ట్ర సాధన కోసం కొనసాగించిన ఆచార్య జయశంకర్ సార్ ను తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రతి సంవత్సరం వారి పేరు మీద స్మారకోపన్యాస సదస్సును నిర్వహిస్తుంది. జయశంకర్ కొనసాగించిన విలువలను, ఉద్యమ స్ఫూర్తిని, సంఘటిత ఆలోచనలను, ప్రజాస్వామిక భావజాల వ్యాప్తిని మరింత ముందుకు తీసుకుపోయే క్రమంలో తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆగస్టు 6 న ఉదయం 10 గం:ల నుండి నాంపల్లిలోని మదీనా ఎడ్యుకేషనల్ సొసైటీ సెంటర్ లో ఆచార్య జయశంకర్ 12వ స్మారకోపన్యాసాన్ని నిర్వహిస్తున్నట్లు వేదిక రాష్ట్ర నాయకులు పందుల సైదు లు తెలియజేశారు.
జయశంకర్ స్మారకోపన్యాస సదస్సులో ‘అసహన రాజకీయాలు-భారతదేశం’ అంశం పై జె.న్.యు న్యూఢిల్లీ కి చెందిన ప్రొ:అజయ్ గుడవర్తి,సియాసత్ ఎడిటర్
జహీర్ అలీఖాన్ మొదటి సెషన్ లో భాగంగా ప్రసంగిస్తారన్నారని, రెండవ సెషన్ లో ‘వర్తమాన తెలంగాణ-విద్యావంతుల కర్తవ్యాలు’ అంశంపై జస్టిస్ సుదర్శన్ రెడ్డి, ప్రొ: హరగోపాల్, కె. శ్రీనివాస్, ఐ.ఏ.ఎస్ ఆకునూరి మురళి, ప్రొ:మురళి మనోహర్, ప్రొ: పద్మజా షా లు ప్రసంగిస్తారని తెలియజేశారు.ఈ కార్యక్రమానికి ప్రజాస్వామిక వాదులందరు హజరై జయశంకర్ ఆలోచనలను ముందుకు తీసుకుపోవాలని విజ్ఞప్తి చేసారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు